హీరోగా ఓ పక్క సినిమాలు చేస్తూనే, ఇంకోపక్క నిర్మాతగా సంచలనాలు సృష్టించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ, రామ్‌చరణ్.. (Box Office Emperor Ram Charan) రెండు పడవల మీద సాఫీగా ప్రయాణం సాగిస్తున్నాడు. రాజకీయాల్లోకి వెళ్ళడం ద్వారా సినీ పరిశ్రమకు దూరమైన చిరంజీవిని తొమ్మిదేళ్ళ తర్వాత సినిమాల్లోకి లాక్కొచ్చింది రామ్‌చరణే.
‘మగధీర’ సినిమాలోనూ, ‘బ్రూస్‌లీ’ సినిమాలోనూ కాస్సేపు చిరంజీవి (Mega Star Chiranjeevi) మెరిశారంటే, అదంతా రామ్‌చరణ్ ఒత్తిడి కారణంగానే. ‘ఖైదీ నెంబర్ 150’ (Khaidi Number 150) సినిమాని చరణ్ ఎంత పక్కాగా ప్లాన్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నెన్నో వివాదాలు సినిమాని చుట్టుముట్టాయి. కానీ, చరణ్ అనుకున్నది సాధించాడు.
100 కోట్ల క్లబ్‌లోకి ‘ఖైదీ నెంబర్ 150’ చేరిందంటే అది చిరంజీవి స్టామినాని మాత్రమే ప్రూవ్ చేయలేదు, నిర్మాతగా చరణ్ (Ram Charan)సామర్థ్యాన్ని కూడా నిరూపించింది. ఇదిగో, ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’ రాబోతోంది. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా చూశాక, ఆ సినిమాని చరణ్ నిర్మించిన తీరుని అర్థం చేసుకున్నాక, ‘సైరా’ ఎలా వుంటుందో అంచనా వేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
‘ధృవ’ సినిమా పనులు చూసుకుంటూనే, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా వ్యవహారాల్ని చక్కబెట్టాడు రామ్ చరణ్ (Mega Power Star). ‘రంగస్థలం’తో (Rangasthalam) ఇండస్ట్రీ రికార్డ్ అందుకున్నాడు.. ‘సైరా’ వ్యవహారాలూ డీల్ చేశాడు. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ చేస్తున్నడు, ‘సైరా’ రిలీజ్ సంగతుల్ని చూసుకుంటున్నాడు. అదీ చరణ్ సమర్థత.
హీరోగా ఎంట్రీ ఇస్తూనే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం మొదలు పెట్టిన చరణ్, మధ్యలో ‘ఆరెంజ్’ సినిమాతో కొంత నిరాశపర్చినా, ఆ తర్వాత మాత్రం విజయాల పరంపర కొనసాగించాడు. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో మళ్ళీ కాస్త డల్ అయినట్లు కన్పించాడు. ‘వినయ విధేయ రామ’ అయితే చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్ టాక్‌ని దక్కించుకుంది.
కానీ, అంత పెద్ద డిజాస్టర్ సినిమాతోనూ అదిరిపోయే వసూళ్ళ సత్తా చాటాడు. సో, చరణ్ బాక్సాఫీస్ స్టామినా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘వినయ విధేయ రామ’ వసూళ్ళతో కొందరు స్టార్ హీరోల హిట్ సినిమాలు కూడా చిన్నబోతాయ్.. దటీజ్ రామ్‌చరణ్ (Box Office Emperor Ram Charan).