బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతెలా, తెలుగులో తొలిసారిగా ఓ సినిమాకి కమిట్ అయ్యింది. ‘బ్లాక్ రోజ్’ (Urvashi Rautela Black Rose) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు.
తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. షేక్స్పియర్ రచించిన ‘ది మర్చంట్ ఆఫ్ వెనిస్’లోని షైలాక్ పాత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందట. కౌటిల్యుడి అర్థ శాస్త్రంలోని ‘విచక్షణ, యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే గొప్ప సూత్రాన్ని జోడిస్తూ ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు చెప్పారు.
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు. చాలాకాలంగా సౌత్‌లో ఓ మంచి సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాననీ, ఈ చిత్రంతో ఆ కోరిక నెరవేరినట్లవుతోందని బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా (Urvashi Rautela) చెప్పింది. ఇండియన్ సినిమా స్క్రీన్‌పై ఇదొక ఆసక్తికరమైన కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇకపై తెలుగులోనూ రెగ్యులర్‌గా సినిమాలు చేయాలనుకుంటున్నట్లు ఊర్వశి (Urvashi Rautela Black Rose) పేర్కొంది. కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేస్తామని చిత్ర దర్శక నిర్మాతలు చెప్పారు.
ఇదిలా వుంటే, సంపత్ నంది ప్రస్తుతం ‘సీటీమార్’ అనే సినిమా చేస్తోన్న విషయం విదితమే. గోపీచంద్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో తమన్నా(Tamannah Bhatia) హీరోయిన్గా నటిస్తోంది. కబడ్డీ నేపథ్యంలో సాగే సినిమా ఇది.