సినీ నటి, అందాల హాసిని జెనీలియా డిసౌజా కరోనా వైరస్ (Genelia Fight Against Corona) బారిన పడింది. అయితే, ఆమెకు కరోనా సోకినా, ఎలాంటి లక్షణాలూ కన్పించలేదట. పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలడంతో, తాను ఐసోలేషన్లోకి వెళ్ళినట్లు చెప్పింది జెనీలియా.
నిజానికి, జెనీలియా కరోనా బారిన పడ్డ విషయం ఆమె తనంతట తానుగా బయటపెట్టేదాకా ఎవరికీ తెలియలేదు. ఇంట్లో వాళ్ళకి మాత్రమే ఈ విషయం తెలుసట. 21 రోజుల క్రిందట తనకు కరోనా పాజిటివ్ అని తేలిందనీ, ప్రస్తుతం కోలుకున్నానని, కరోనా టెస్టుల్లో నెగెటివ్ వచ్చాక జెనీలియా భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టింది సోషల్ మీడియాలో.
స్మార్ట్ ఫోన్, డిజిటల్ టెక్నాలజీ అందుబాటులో వున్నాసరే.. ఒంటరితనాన్ని భరించడం చాలా కష్టమనీ, ఆ విషయం తనకు గడచిన 21 రోజుల్లో అర్థమయ్యిందని జెనీలియా చెప్పుకొచ్చింది. తిరిగి ఫ్యామిలీని కలుసుకున్నందుకు చాలా చాలా ఆనందంగా వుందని జెనీలియా తన భావోద్వేగపు పోస్ట్‌లో పేర్కొంది.
ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తోన్న జెనీలియా (Genelia Fight Against Corona), మంచి ఆహారం తీసుకోవడం, ఫిట్‌గా వుండడం ద్వారా కరోనాపై పోరాటం సులువుగా చేయొచ్చని పేర్కొంది. బాలీవుడ్లో ఇప్పటికే చాలామంది కరోనా బారిన పడ్డారు.
బిగ్-బి అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, బిగ్-బి కోడలు ఐశ్వర్యరాయ్, బిగ్-బి మనవరాలు ఆరాధ్య కూడా కరోనా బారిన పడిన విషయం విదితమే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడాల్లేవు.. నిజానికి.. వాళ్ళూ వీళ్ళూ అన్న తేడాల్లేవ్ కరోనా వైరస్‌కి. దేశంతో కరోనా రోజురోజుకీ విజృంభించేస్తోంది.
అయితే, కరోనా కారణంగా సంభవిస్తోన్న మరణాల శాతం క్రమక్రమంగా తగ్గుతుండడం కాస్త ఊరట. అలాగని నిర్లక్ష్యంగా వుండడానికి వీల్లేదు. కరోనా వైరస్‌పై పోరులో గెలిచిన సెలబ్రిటీలు, తాము ఆ మహమ్మారిని ఎలా జయించిందీ చెబుతోంటే.. అది చాలామందికి చాలా చాలా ధైర్యాన్నిస్తుంది. రాజమౌళి, విశాల్, బండ్ల గణేష్.. ఇలా చాలామంది కరోనా బారిన పడి కోలుకున్న విషయం విదితమే.