హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌పై డ్రగ్స్ (Rakul Preet Singh Smoking) ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ అనుమానాస్పద మరణం కేసు కాస్తా, ‘డ్రగ్స్ టర్న్’ తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది.
సుశాంత్ మరణానికి రియా కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో అరెస్టయిన రియా చక్రవర్తి, రకుల్ పేరు విచారణ సందర్భంగా చెప్పిందన్నది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చెబుతున్న మాట. తనతోపాటు రకుల్, సారా అలీఖాన్ కూడా డ్రగ్స్ సేవించారని రియా వాంగ్మూలం ఇచ్చిందట.
అయితే, ఈ కేసులో తనను మీడియా వేధిస్తోందంటూ రకుల్ ప్రీత్ సింగ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మరోపక్క, తనకు సిగరెట్ స్మోకింగ్ కూడా అలవాటు లేదని తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురిచేస్తున్నాయి.
ఈ మధ్య కొన్ని సినిమాల్లో రకుల్ ప్రీత్ సింగ్, సిగరెట్ స్మోక్ చేస్తూ కనిపిస్తోంది. అయితే, అవన్నీ కేవలం నటన కోసమేననీ, అవి రియల్ సిగరెట్లు కావనీ చెప్పిందీ బ్యూటీ. నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ చాలా హెల్త్ కాన్షియస్. ఎప్పుడూ ఫిట్‌నెస్ గురించి కష్టపడుతుంటుంది.
ఫిట్‌నెస్ స్టూడియోలు కూడా రన్ చేస్తోంది. ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించేలా తనవంతు కృషి చేస్తుంటుంది రకుల్ ప్రీత్ సింగ్. వెజిటేరియన్‌గా కూడా మారిపోయింది. ధూమపానానికీ, మద్యపానానికీ దూరంగా వుండాలంటూ సలహాలు కూడా ఇస్తుంటుంది.
అలాంటి రకుల్ ప్రీత్, డ్రగ్స్ సేవించడమేంటి.? అన్న అనుమానం చాలామందికి కలుగుతోంది. మరోపక్క, ‘రకుల్ ప్రీత్ సింగ్ స్మోకింగ్’ అంటూ నెటిజన్లు ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తున్నారట. ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్‌కి నిజంగానే స్మోకింగ్ అలవాటు లేదా.? అంటే, లేదనే అంటున్నారు ఆమె సన్నిహితులు కూడా.
మరి డ్రగ్స్ ఆరోపణలేంటి.? రియా చక్రవర్తి ఎందుకు రకుల్ ప్రీత్ సింగ్ పేరు చెప్పింది? ఇది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే.