ఒక్కసారిగా బిగ్‌హౌస్‌లో వాతావరణం వేడెక్కింది. ‘రోబోట్స్ – హ్యామన్స్’ టాస్క్‌తో మొదలైన గొడవ (Bigg Boss Telugu 4 Silly Fight) ముదిరి పాకాన పడింది. గ్రూపులు షురూ అయ్యాయి. ఇంతలోనే ‘చిల్లరగోల’ తెరపైకొచ్చింది. ‘కిల్లర్ కాయిన్స్’ అనే టాస్క్ సందర్భంగా హౌస్మేట్స్, తమ గార్డెన్ ఏరియాలోకి వచ్చి పడే ‘కాయిన్స్’ని కలెక్ట్ చేయాల్సి వచ్చింది.
కంటెస్టెంట్స్ ఆ కాయిన్స్ కోసం పోటీపడ్డారు. ఈ క్రమంలో కొందరు జారిపడి, గాయాలపాలయ్యారు కూడా. దాదాపుగా అందరికీ గాయాలయ్యాయి. వీటికి తోడు దొంగతనాలు, ఈ క్రమంలో తలెత్తిన గొడవలు.. వెరసి బిగ్‌హౌస్‌లో ‘చిల్లర పంచాయితీ’ షురూ అయ్యింది.
‘కథ వేరేగా వుంటుంది’ అనే ఊతపదాన్ని చాలా తేలిగ్గా వాడేస్తున్నాడు సోహెల్. అతనికి మద్దతుగా మెహబూబ్ రంగంలోకి దిగాడు. కంటెస్టెంట్స్ ‘పంపకాల’ కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటే, ‘ఎవరి ఆట వాళ్ళే ఆడాలి’ అని ఆదేశించాడు బిగ్‌బాస్. ఇంకోపక్క, దొంగతనాలు పెరిగిపోయాయి.
దాంతోపాటే గొడవలూ ఎక్కువయ్యాయి. దొంగతనం చేసి మరీ మెహబూబ్ అత్యధికంగా కాయిన్స్ సంపాదించాడు. కానీ, ఏం లాభం.? స్పెషల్ కాయిన్ ‘స్విచ్ కాయిన్’ని చేజార్చుకున్నాడు.. అది సుజాత చేతికి చిక్కింది. టాస్క్‌లో ఫస్ట్ లెవల్ కంప్లీట్ అయ్యాక గొడవలు ఇంకా పెరిగిపోయాయి.
ఈ క్రమంలో అవినాష్ గాయపడినట్లు తెలుస్తోంది. అతనికి వైద్య సహాయం అందించేందుకోసం మెడికల్ రూంకి తరలించారు కంటెస్టెంట్స్. నడవలేని పరిస్థితుల్లో వున్న అవినాష్‌ని ఎత్తుకుని తీసుకెళ్ళారు. మరోపక్క ‘కథ వేరేలా వుంటుంది’ అన్న సోహెల్ మాటకి అమ్మ రాజశేఖర్ ఆగ్రహంతో ఊగిపోయాడు.
మాటలు హద్దులు దాటాయ్. ‘కొడతావేంట్రా.?’ అంటూ అమ్మ రాజశేఖర్ మరింతగా వాయిస్ పెంచాడు. కాగా, ఈ ‘చిల్లర టాస్క్’ నుంచి దివి కాస్త వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. మరోపక్క అబిజీత్ – హారిక మధ్య ‘కెమిస్ట్రీ’ పెరుగుతోంది.
కాగా, దొంగతనాల నేపథ్యంలో తలెత్తిన వివాదంతో మోనాల్ గజ్జర్ తీవ్ర ఆవేదనకు గురయ్యింది. కెమెరా సాక్షిగా బిగ్‌బాస్‌కి ఏదో చెప్పాలనుకున్న మోనాల్‌ని, తెలుగులో మాట్లాడాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించేసరికి, బాత్రూంలోకి వెళ్ళి బిగ్గరగా ఏడ్చేసింది.. అదీ చిన్న పిల్లలా.!
మొత్తంగా చూస్తే, ఈ టాస్క్‌తో ఎవరికి లాభం చేకూరుతుందోగానీ.. దాదాపుగా అందరూ గాయాలపాలయ్యారు. అవసరమా ఈ చెత్త టాస్క్.. (Bigg Boss Telugu 4 Silly Fight) అని బిగ్‌బాస్ వ్యూయర్స్ అభిప్రాయపడుతున్నారు.