నామినేషన్స్‌లోకి రావడమంటే, అదేమీ పెద్ద నేరం కాదు కదా.! తమ ఆట తీరు మీద నమ్మకం.. తమను ప్రేక్షకులు గెలిపిస్తారన్న నమ్మకం వుంటే.. నామినేషన్స్ అసలు సమస్యే కాదు. కానీ, నామినేషన్స్‌లోకి వెళ్ళేందుకు కొందరు భయపడ్డారు.. కొందరు నామినేషన్స్‌లోకి ధైర్యంగా వెళ్ళారు (Ariyana Divi Avinash Super Stars).
లాస్య ఏవో కుంటి సాకులు చెప్పింది.. ఆ కథలు ఎవరికీ అర్థం కాలేదు. దివి స్ట్రెయిట్‌గా చెప్పాలనుకున్నది చెప్పేసింది. లాస్యని కన్విన్స్ చేయాలనుకోలేదు. లాస్య ఎలాగూ కన్విన్స్ అవదు గనుక, స్ట్రెయిట్‌గా తానే నామినేట్ అవనున్నట్లు తేల్చేసింది.
Also Read: మోనాల్ సూపర్.. అఖిల్ ఫెయిల్యూర్.!
ఇక, సోహెల్ – అవినాష్ మధ్య ‘ఎవరు నామినేట్ అవ్వాలి.?’ అన్న చర్చ జరిగింది. సోహెల్‌కి సరైన రీజన్ లేదు. అవినాష్ మాత్రం చెప్పాలనుకున్నది చెప్పాడు. అన్నట్టు, తాను ఏడ్చిన విషయాన్నీ నిస్సిగ్గుగా చెప్పేసుకున్నాడు సోహెల్. ఓవరాల్‌గా అవినాష్‌దే పై చేయి అయ్యింది.
కానీ, ధైర్యంగా నామినేషన్‌లోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యాడు. ఇక, అరియానా – మెహబూబ్‌ల గొడవకి వస్తే, అరియానా సూపర్ స్ట్రాంగ్‌గా వాదించింది. మెహబూబ్ అడ్డగోలు వాదన చేశాడు. గత వారం సోహెల్ కారణంగా నామినేషన్ నుంచి గట్టెక్కేసిన మెహబూబ్, ఈ వారం ధైర్యంగా నామినేషన్‌లోకి వెళ్ళాల్సి వుంది.
Also Read: హారికని గెలిపించి, తానూ గెలిచిన అబిజీత్
అట్నుంచి అరియానా ఎంతలా రిక్వెస్ట్ చేసినా, మెహబూబ్ ‘తర్వాత సాయం చేస్తాను.. ఇప్పుడు నాకు నువ్వు సాయం చెయ్..’ అనేసి, తప్పించేసుకున్నాడు. చాలాసేపు మెహబూబ్‌ని కన్విన్స్ చేయాలనుకున్న అరియానా, ఇక దండగ అనే నిర్ణయానికి వచ్చేసి.. ధైర్యంగా నామినేట్ అయ్యేందుకు ముందుకొచ్చింది.
నిజానికి, లాస్య తనంతట తానుగా నామినేట్ అయి వుండాల్సింది. సోహెల్ కూడా అదే పని చేయాల్సి వుంది. మెహబూబ్ కూడా అదే బాటలో నడిచి వుండాల్సింది. అదే చేస్తే ఈ ముగ్గురూ ‘పవర్’ చూపించినట్లయ్యేది. కానీ, ఈ ముగ్గురూ పవర్‌లెస్‌గా మారడంతో.. ఆ పవర్ దివి, అవినాష్, అరియానాలకు (Ariyana Divi Avinash Super Stars) లభించింది.