బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అయినంతమాత్రాన, క్యారెక్టర్ చంపుకోవాల్సిందేనా.? ‘మీరు మీలా వుండండి..’ అని హోస్ట్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), కంటెస్టెంట్స్‌ని ఉద్దేశించి పదే పదే చెబుతున్న విషయం విదితమే. మరి, అలాంటప్పుడు.. అబిజీత్ (Abijeet King Of Confidence BB4 Telugu) తనలా వుంటే, బిగ్‌బాస్‌కి కోపమెందుకొచ్చింది.
బిగ్‌బాస్ చెప్పాడు కాబట్టి, మోనాల్‌ని ఏడిపించినట్లు అబిజీత్ తనకు తాను సర్దిచెప్పుకోవాలన్నమాట. అంటే, బిగ్‌బాస్ స్టేట్‌మెంట్ ఎలా ఇస్తే, అలా అబిజీత్ తన క్యారెక్టర్‌ని నాశనం చేసుకోవాలా.? బానిసత్వంలో ఇలాంటివి జరుగుతుంటాయి తప్ప, రియాల్టీ షోలలో కాదన్న అభిప్రాయాలు అంతటా వినిపిస్తున్నాయి.
మోనాల్ గజ్జర్‌ని (Monal Gajjar) పనిగట్టుకుని ఏడిపించాల్సిన అవసరం అబిజీత్‌కి ఏంటి.? ఈ స్టేట్‌మెంట్ అతనికి నచ్చలేదు. అందుకే, ఆ లైన్‌తో స్టార్ట్ చేసి, టాస్క్ ఇస్తే, ‘ససేమిరా’ అనేశాడు. దాన్ని బిగ్‌బాస్ తీవ్రంగా ఆక్షేపించాడు. వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. ‘అది నా అభిప్రాయం.. నాకు ఆ ఫస్ట్ లైన్ నచ్చలేదు..’ అని తెగేసి చెప్పాడు అబిజీత్.
ఇందులో మొహమాటమేమీ లేదు, అబిజీత్‌ని బిగ్‌బాస్ (Bigg Boss Telugu 4) వెంటనే హౌస్ నుంచి బయటకు పంపించేయొచ్చు.. అది బిగ్‌బాస్ ఇష్టం. అంతే తప్ప, ఓ వ్యక్తి తన మనోభీష్టానికి వ్యతిరేకంగా ఫలానా పని చేయాలని ఆదేశించడమేంటి.? ఇక్కడ అబిజీత్ తన క్యారెక్టర్‌ని లాస్ అవదలచుకోలేదు.
టాస్క్ పరంగా బిగ్‌బాస్ (Bigg Boss 4 Telugu), అబిజీత్‌ని టార్గెట్ చేసి వుండొచ్చు. కానీ, చూస్తోన్న లక్షలాది మంది వ్యూయర్స్ మనసుల్ని మాత్రం అబిజీత్ గెలుచుకున్నాడు. దేన్నయినా ధిమాక్‌తో ఆలోచించడం బిగ్‌బాస్‌కి అలవాటు. అదే చేస్తున్నాడు కూడా. అందుకే, అతన్ని చాలామంది ఇష్టపడుతున్నారు.
కొంతమంది కంటెస్టెంట్స్ ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారో వాళ్ళకే తెలియదు. కొందరికి ఇమ్యూనిటీ ఎలా దక్కుతుందో ఎవరికీ అర్థం కావడంలేదు. దీన్నసలు రియాల్టీ షో అని ఎలా అనగలం.? అన్న ప్రశ్న చాలామందిని వేధిస్తోంది.
సో, అబిజీత్‌గానీ, అబిజీత్‌ని అభిమానించేవారుగానీ, హౌస్‌లో జరుగుతున్న పరిణామాలపై కలత చెందాల్సిన అవసరమే లేదు. హౌస్‌లో వున్నప్పుడు వ్యక్తిత్వం కోల్పోతే, హౌస్ బయటకు వచ్చాక ఆ ఎపిసోడ్స్ చూసి, తనను తాను సమర్థించుకోలేనన్న విషయం అబిజీత్‌కి (Abijeet King Of Confidence BB4 Telugu) బాగా తెలుసు.
అందుకే, ఏ విషయంలో అయినా క్యాలిక్యులేటివ్‌గానే వ్యవహరిస్తున్నాడు. కాన్ఫిడెంట్‌గా వుంటున్నాడు. దటీజ్ అబిజీత్.