బాలీవుడ్ నటి కంగనా రనౌత్కి ‘నటి’ అన్న గుర్తింపు కంటే, ‘వివాదాల నటి’ అనే గుర్తింపే ఎక్కువ. ఏదన్నా విషయమ్మీద స్పందిస్తే, తద్వారా వచ్చే పబ్లసిటీ ఎంత.? అని లెక్కలేసుకోవడంలో కంగనా రనౌత్ (Kangana Ranaut Controversial Publicity Queen) దిట్ట. దేశంలో ఇప్పుడు రైతుల ఆందోళన హాట్ టాపిక్.
కేంద్ర ప్రభుత్వానికీ, రైతులకీ మధ్య ‘కొత్త వ్యవసాయ చట్టాల’ విషయమై రచ్చ జరుగుతోంది. ప్రభుత్వం రైతుల డిమాండ్ల పట్ల స్పందించాల్సిన రీతిలో స్పందించడంలేదు. రైతులూ, మొండి పట్టుదలకు పోతున్నారు. ఇద్దరూ మెట్టు దిగి చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని దేశమంతా ఆకాంక్షిస్తోంది.
ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. రైతుల ఉద్యమాన్ని అడ్డం పెట్టకుని దేశంలో విద్వేషం రగల్చాలనీ, విధ్వంసాలు సృష్టించాలని కొందరు చేస్తున్న ప్రయత్నాల్ని తిప్పి కొట్టాల్సిన సందర్భమిది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తదితర క్రికెటర్లు, కొందరు సినీ తారలు ‘సమస్యకు సానుకూల పరిష్కారం’ లభించాలని ఆకాంక్షించడం, కంగనా రనౌత్కి నేరంగా కనిపిస్తోంది.

అలాంటివారిని ‘కుక్కలతో’ పోల్చడంతో తన ‘బుద్ధి’ని చాటుకుంది కంగనా రనౌత్. సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాయడంలో కంగనా రనౌత్ ఏనాడో మాస్టర్ డిగ్రీ సంపాదించేసింది. వివాదాల ద్వారా పబ్లసిటీ ఎలా పొందాలో ఆమెకు బాగా తెలుసు మరి. ఈ విషయంలో కూడా ఇంత కక్కుర్తి అవసరమా.? ఈ పబ్లసిటీ పైత్యానికి మెడిసన్ అసలు వుందా.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
‘మనమందరం భారతీయులం.. మనమంతా ఐక్యంగా వుండాల్సిన సందర్భమిది..’ అని సెలబ్రిటీలు మంచి ఉద్దేశ్యంతో ట్వీట్లు వేయడం కంగనా రనౌత్కి (Kangana Ranaut Controversial Publicity Queen) నచ్చడంలేదు. ఇంతకీ, కంగన ఎవరి నుంచి ప్రశంసలు ఆశిస్తోందో అర్థం కావడంలేదు. నిజమే, ఆమె ఏం చేసినా అందులో అర్థం వుండదు.
అసలు కంగనా రనౌత్కే తెలియదు, ఏ విషయమ్మీద ఎలా స్పందించాలో. ఎలాగోలా తన పేరు వివాదాస్పదంగా వార్తల్లోకెక్కాలి, తద్వారా పబ్లిసిటీ పొందాలి.. ఇదొక్కటే తెలుసామెకి. కానీ, ఈ నైజం సమాజానికి అస్సలు మంచిది కాదు.
ఎందుకంటే, సమాజాన్ని ఎంతో కొంత ప్రభావితం చేయగలదు కంగనా రనౌత్ తన పాపులారిటీ. ఇలాంటి సందర్భాల్లోనే అనిపిస్తుంది, ‘కనకపు సింహాసనము మీద శునకమును కూర్చుండబెట్టిన..’ అన్న పెద్దల మాట.