మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత, టీమిండియాకి అలాంటి ఆటగాడు మళ్ళీ దొరుకుతాడా.? లేదా.? అన్న చర్చ ధోనీ జట్టులో వుండగానే జరిగింది. ఆ మాటకొస్తే, ధోనీ రిటైర్మెంట్‌కి ఐదారేళ్ళ ముందే జరిగింది. చాలా ప్రయోగాలు జరిగాయి (Rishab Pant Resembles Ms Dhoni).
చాలామంది జట్టులోకి వచ్చారు.. ధోనీ స్థానాన్ని భర్తీ చేస్తారన్న ఆలోచనతో. కానీ, ఆ ప్రయోగాలేవీ సఫలం కాలేదు. ఈలోగా ధోనీకి వయసైపోయింది. ఇక, వేరే దారి లేదు.. రిషబ్ పంత్ మాత్రమే, ఆ స్థాయిలో జట్టుకి ఉపయోగపడగలడని అంతా డిసైడ్ అయిపోయారు.
కానీ, పంత్ పరిస్థితి వేరు. బ్యాటింగ్ అనగానే వీర దూకుడు ప్రదర్శిస్తాడు. వికెట్ల వెనకాల నిర్లక్ష్యం వహిస్తాడు.. బ్యాటింగ్ పరంగా చూసుకున్నా.. నిర్లక్ష్యం అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం. ఈ కారణంగానే టీమిండియాకి పంత్.. పెను భారంగా మారిపోయాడు. అతన్ని వదిలించుకుంటే, అతని స్థానంలో ఇంకెవరు.? అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు.
రిషబ్ పంత్.. మారిన మనిషి..
ఎలాగైతేనేం, క్రమక్రమంగా కుదురుకుంటున్నాడు రిషబ్ పంత్ (Rishab Pant Resembles Ms Dhoni). ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా పంత్ మంచి మార్కులే వేయించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో స్వదేశంలో టెస్ట్ క్రికెట్ రిషబ్ పంత్‌కి అసలు సిసలు పరీక్ష. అందునా, స్పిన్‌కి అనుకూలించే పిచ్‌ల మీద వికెట్ కీపింగ్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
బ్యాటింగ్‌లో వైఫల్యం చెందినా కాస్త సరిపెట్టుకోవచ్చేమో.. వికెట్ కీపింగ్ వైఫల్యాలంటే అది క్షమించరాని నేరమైపోతుంది. కానీ, రెండో టెస్టులో రిషబ్ పంత్ అదరగొట్టేశాడు. అత్యద్భుతమైన స్టంప్స్ చేశాడు. ఇంకేముంది.? రిషబ్ పంత్ రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు.
ఇండియాలో వికెట్ అంటే అంతే మరి..
ఇండియన్ పిచ్‌లు చాలా భిన్నంగా వుంటాయి స్పిన్‌కి సంబంధించి. ఇక్కడ వికెట్ కీపర్ రాణిస్తే, ప్రపంచంలో ఏ మైదానంలో అయినా అదరగొట్టేయొచ్చు. తాను బౌలింగ్ చేస్తున్నప్పుడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) పదే పదే రిషబ్ పంత్‌తో మాట్లాడాడు. పంత్‌కి పలు సూచనలిచ్చాడు. అవే పంత్ సక్సెస్ అవడానికి ఉపయోగపడ్డాయని అనుకోవాలేమో.
బ్యాటింగ్‌లో కూడా పంత్‌ది (Rishab Pant Resembles Ms Dhoni) చాలా ప్రత్యేకమైన శైలి. ధోనీ కంటే దూకుడు స్వభావం ఎక్కువ. కానీ, నిర్లక్ష్యపు షాట్లు ఆడేస్తాడు. ఆ ఒక్క విషయంలో కాస్త సంయమనం పాటిస్తే.. రిషబ్ పంత్‌ని ధోనీ వారసుడిగా అందరూ ఒప్పుకుని తీరాల్సిందే.