ప్రత్యర్థి రెచ్చగొడితే రెచ్చిపోతాడు.. జట్టు కోసం పరితపిస్తాడు.. అత్యద్భుతమైన ఫామ్ ఎప్పుడూ కొనసాగించేందుకు కష్టపడతాడు. అలాంటి విరాట్ కోహ్లీ కుంగిపోవడమేంటి.? భారీ టార్గెట్‌ని ఛేజ్ చేయాల్సి వస్తే.. ‘వేగంగా చితక్కొట్టేద్దాం..’ అనుకుంటాడు విరాట్ కోహ్లీ (Virat Kohli About Metal Depression).
‘వేగంగా పరుగులు చేసేస్తే, ఒత్తిడి తగ్గిపోతుంది.. అదే కాస్త ఆచి తూచి ఆడితే, లక్ష్యాన్ని ఛేదించడం కష్టమవుతుంది..’ అని చెప్పే విరాట్ కోహ్లీ కూడా ఓ దశలో కుంగిపోయాడట. తాజాగా ‘నాట్ జస్ట్ క్రికెట్’ పాడ్‌కాస్ట్ సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్న కఠినతరమైన పరిస్థితుల గురించి వివరిస్తూ వాపోయాడు.
2014లో ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా తాను ఫామ్ కోల్పోయాననీ, ఆ దశలో తనకు చాలామంది అండగా నిలిచినప్పటికీ, తాను ఒంటరిననే భావనతో వుండేవాడినని చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ (Virat Kohli About Metal Depression).
‘నా చుట్టూ చాలామంది వున్నారు. నాకు అండగా నిలిచారు. కానీ, నా మనసులోని బాధను అర్థం చేసుకునే వ్యక్తి ఇంకెవరూ లేరన్న భావనకు నేను గురయ్యాను..’ అని చెప్పాడు విరాట్ కోహ్లీ.

‘నేనొక్కడినే కాదు, బహుశా చాలామంది ఇలాంటి ఇబ్బందికి గురయ్యే వుంటారు. కొందరికి అది జీవిత కాలం పాటు వేధించే సమస్యగా మారొచ్చు కూడా..’ అని కింగ్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. అయితే, మానసిక కుంగుబాటుని పది మందితో కలవడం వల్ల కొంత మేర తగ్గించుకోవచ్చునని అన్నాడు కోహ్లీ.
తండ్రిని కోల్పోయిన సమయంలో విరాట్ కోహ్లీ పిన్న వయస్కుడే. అదే అతని జీవితంలో అతి పెద్ద కష్టం. దేశం తరఫున అత్యున్నతమైన క్రికెటర్‌గా సత్తా చాటాలనుకున్న కోహ్లీ (Virat Kohli About Metal Depression) ఆనాటి ఆ ఆలోచన నిజమయ్యిందంటే, దీని వెనుక కోహ్లీ ఎంతగా కష్టపడి వుండాలి.?
క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదనీ, అదీ జీవితం లాంటిదేనని.. మైదానంలో పరిస్థితులకు అనుగుణంగా ఎలా మారతామో, జీవితంలోనూ అలాగే మారాల్సి వుంటుందని కోహ్లీ చెప్పాడు. తన జట్టులో ఎవరికైనా మానసిక సమస్య వుందని తనకు అనిపిస్తే, వెంటనే వారి దగ్గరకు వెళ్ళి సరదాగా మాట్లాడతాననీ, కెప్టెన్‌లా కాకుండా ఆ సమయంలో సాటి ఆటగాడిగా, ఓ సోదరుడిగా అండగా వుండడం తన బాధ్యత అని అంటున్నాడు విరాట్ కోహ్లీ.
అందుకే, క్రికెట్‌లో విరాట్ చాలా చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఊరికే కోపం వస్తుంది.. కానీ, అది కాస్సేపే. మ్యాచ్ కోసం వ్యూహాలు రచించే క్రమంలో కోహ్లీ (Virat Kohli About Metal Depression) ఆలోచనలు అత్యంత వేగంగా పరుగులు పెడతాయి. గెలుపోటములు సహజం. ఒక్కోసారి మానసికంగా కుంగుబాటు కూడా మామూలే కావొచ్చు.. కానీ, వీలైనంత త్వరగా దాన్నుంచి బయటపడాలి.. అది క్రికెటర్ అయినా, ఇంకెవరైనా.