స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇకపై ఐకాన్ స్టార్ (Pushpa Teaser Stylish Star Allu Arjun Becomes Icon Star). ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్న అల్లు అర్జున్, ఈ సినిమాతో తన పేరు ముందున్న ‘స్టైలిష్ స్టార్’ని కాస్తా, ‘ఐకాన్ స్టార్’గా మార్చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతోన్న ‘పుష్ప’ సినిమా నుంచి హీరో పాత్రని తాజాగా రివీల్ చేశారు.
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘పుష్పరాజ్’ ఇంట్రో.. అదిరిపోయిందంతే. ఆ యాక్షన్ ఏంటి.? ఆ గెటప్ ఏంటి.? మాస్ కా బాప్.. అనే స్థాయిలో సినిమా తెరకెక్కుతున్నట్లే కనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ అనే స్థాయిలో వుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే దేవిశ్రీ ప్రసాద్ ఇరగదీసేసినట్లే వున్నాడు.
సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) టేకింగ్.. ‘పుష్పరాజ్’ (Pushpa Raj) ఇంట్రోతోనే బీభత్సమైన రెస్పాన్స్ రాబడుతోన్న దరిమిలా, సినిమా విడుదలయ్యాక.. ఇంకో లెవల్.. అనేలా వుండబోతోందని ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హీరోయిన్ రష్మిక మండన్న (Rashmika Mandanna), పల్లెటూరి యువతిలా కనిపిస్తోంది.
ఆ ఛేజింగులేంటి.. ఆ యాక్షన్ సన్నివేశాలేంటి.? అన్నటికీ మించి పుష్పరాజ్.! అసలంటూ అల్లు అర్జున్ ఎక్కడా కన్పించలేదు.. పుష్పరాజ్ (Pushpa) పాత్రలో జీవించేశాడు మరి.
తన కెరీర్‌లో ఇదొక ఐకానిక్ మైల్ స్టోన్ అవుతుందని భావించే బహుశా తనకున్న ‘స్టైలిష్ స్టార్’ (Stylish Star) అనే ఇంకో పేరుని ‘ఐకాన్ స్టార్’గా అల్లు అర్జున్ (Pushpa Teaser Stylish Star Allu Arjun Becomes Icon Star) మార్చుకున్నాడన్నమాట.
