మిల్కీ బ్యూటీ తమన్నా.. అని అంతా పిలుస్తోంటే, ‘దయచేసి అలా పిలవొద్దు..’ అని అంతే ముద్దుగా చెబుతుంటుంది.. అదీ ఆమె ప్రత్యేకత. చేసే ప్రతి సినిమా విషయంలోనూ 100 శాతం (Tamannah Bhatia 100 Percent Dedication) శక్తి వంచన లేకుండా పని చేయడానికే ప్రయత్నిస్తానని చెబుతుంటుంది తమన్నా.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా, మహళల విషయంలో కొందరు ప్రదర్శించే చిన్న చూపుపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. ‘మహిళలు, పురుషులు వేర్వేరు కాదు.. చేసే పని పట్ల నిబద్ధత విషయంలో మహిళలు, పురుషులతో సమానమే..’ అని చెప్పింది.
ఆ సంగతి పక్కన పెడితే, తాజాగా తమన్నా (Tamannah Bhatia) తన నాజూకు శరీరాన్ని మరింత నాజూకుగా మార్చేందుకు నడుం బిగించింది. ‘యాబ్స్ లోడింగ్..’ అంటూ తమన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో వైరల్ అయ్యింది. నిజానికి, తమన్నా ఎప్పుడు పూర్తి ‘ఫిట్’గానే కనిపిస్తుంటుంది. కానీ, ఈసారి యాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టుంది.

కెరీర్ పరంగా చూసుకుంటే చాలా సినిమాలు, అందులో చాలా విభిన్నమైన పాత్రలు పోషించినా, అనుభవంతోపాటే బాధ్యత పెరిగింది కాబట్టి, ఇకపై మరింత భిన్నమైన సినిమాల్ని ఎంచుకోవాల్సిన బాధ్యత తన మీద వుందనీ, ఆ కోణంలోనే తనను తాను మరింత శక్తివంతంగా మలచుకుంటున్నాననీ తమన్నా చెప్పుకొచ్చింది.
తమన్నా, గోపీచంద్ నటించిన ‘సీటీమార్’ (Seetimaarr Tamannah Bhatia Gopichand) సినిమా విడుదల కావాల్సి వుండగా, నితిన్ సరసన ఓ సినిమాలో తమన్నా (Tamannah Bhatia 100 Percent Dedication) నటిస్తోంది. ఇవి కాక ‘వెబ్ సిరీస్’లు చేస్తూ, క్షణం తీరిక లేకుండా వుంది.
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఏ భాషలో అయినా నటన విషయానికొస్తే, పెద్దగా తేడాలేమీ వుండవని తమన్నా అభిప్రాయపడింది. ఓటీటీ కంటెంట్ విషయానికొస్తే, సినిమా కంటే ఇంకాస్త ‘వైడ్ యాంగిల్’లో మంచి కథల్ని చెప్పేందుకు ఇదొక మంచి వేదిక అని చెప్పింది తమన్నా.