అన్వేషి జైన్ (Anveshi Jain) పేరుని నెటిజన్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. అంతర్జాలంలో అత్యంత ఎక్కువగా ఈమె గురించే వెతికేస్తున్నారు నెటిజనులు.
అందాల భామ అన్వేషి జైన్, హాట్ హాట్ ఫొటోల్ని సోషల్ మీడియాలో పెడుతుందనీ, కైపెక్కించే వీడియోలతో సెగలు రేపుతుందని మాత్రమే కాదు.. అంతకు మించిన మ్యాజిక్ ఏదో ఆమెలో వుంది.
‘నా శరీరమే నాకు ఒకప్పుడు పెద్ద మైనస్ పాయింట్. హార్మోన్ సమస్యలో, ఇంకేదన్నా కారణమో.. నేనూ అందరిలాంటి అమ్మాయినే అయినా, నా రూపం చూసి చాలామంది నన్ను దూరం పెట్టారు.
కానీ, నాకు ఎదైతే మైనస్ అని నేను భావించానో, ఇతరులు నన్ను ఏం చూసి ఎగతాళి చేశారో.. ఆ మైనస్ ఇప్పుడు నాకు పెద్ద ప్లస్ అయ్యింది..’ అంటూ అన్వేషి జైన్ తాజాగా ఓ సందర్భంలో వెల్లడించింది.
Anveshi Jain పాపులారిటీ తెచ్చిన తిప్పలు..
‘గందీ బాత్’ (Gandi Baat)అనే వెబ్ సిరీస్ ద్వారా అన్వేషి జైన్ (Anveshi Jain Hot) పాపులారిటీ చాలా చాలా పెరిగింది. ఆ పాపులారిటీకి కారణం ఆమె మీద వచ్చిన విమర్శలే.
జుగుప్సాకరమైన కామెంట్లు తన మీద వస్తే, ఓపిగ్గా భరించాననీ, తనను తొలుత విమర్శించినవారే, ఆ తర్వాత తనకు అభిమానులుగా మారారనీ చెబుతుంటుంది అన్వేషి జైన్.
ఉన్నత చదువులు చదివి, మోడలింగ్ చేసి, ప్రస్తుతం ‘హాటెస్ట్ ఐకాన్’గా సోషల్ మీడియాలో చెలామణీ అవుతోంది. సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.. ‘వెబ్ సిరీస్’లలో నటిస్తూ పేరు ప్రఖ్యాతులు మరింతగా పెంచుకుంటోంది.

‘లక్షల్లో ఫాలోవర్స్ ఊరికే వచ్చేయరు.. నేను సోషల్ మీడియాలో షేర్ చేసేవి వల్గర్ ఫొటోలు, వల్గర్ వీడియోలు కావు..’ అని చెబుతుందీ భామ.
‘చాలామంది అందాల భామలు చేసేదే నేనూ చేస్తున్నాను.. కానీ, నా శరీరం కాస్త ప్రత్యేకం. అదే ఒకప్పుడు మైనస్, ఇప్పుడు అదే పెద్ద ప్లస్..’ అన వివరణ ఇచ్చింది.
Also Read: Babli Bouncer Review: తమన్నా న్యూ యాంగిల్.!
మన శరీరం, మన రంగు ఎలా వున్నా, దాన్ని మనం ప్రేమించగలిగితే, మన ఆత్మ విశ్వాసాన్ని మనం పెంపొందించుకోగలిగితే, జీవితాన్ని గెలవగలం.. అని చెబుతుంటుందీ భామ.
నటిగా, ‘డేటింగ్ కోచ్’గా, అన్వేషి జైన్ (Anveshi Jain Glamorous Social Media Icon) కెరీర్ గమనం చాలా చాలా ప్రత్యేకం.