Virat Kohli Captaincy.. మోడ్రన్ ఇండియన్ క్రికెట్ గురించి మాట్లాడుకోవాలంటే, అందులో ఖచ్చితంగా విరాట్ కోహ్లీ పేరు ముందు వరుసలో వుంటుంది. దూకుడుకి మారు పేరు విరాట్ కోహ్లీ. అండర్-19 జట్టు నుంచి, సీనియర్స్ జట్టుకి ప్రమోట్ అయిన విరాట్ కోహ్లీ.. మొదటి నుంచీ ఒకే తరహా దూకుడు ప్రదర్శిస్తూ వచ్చాడు.
టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌గా టీమిండియా బ్యాటింగ్ లైనప్‌కి వెన్నెముకగా నిలిచిన విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలో రాటుదేలాడు. ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాల్ని అందుకున్న విరాట్ కోహ్లీ, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ తర్వాత, కెప్టెన్సీ బాధ్యతలకు కత్తెర వేసుకుంటున్నట్లు ప్రకటించాడు.
Also Read: నో డౌట్.! అర్జంటుగా విరాట్ కోహ్లీని పీకెయ్యాల్సిందే.!
ఇంకపై టీ20 పోటీల్లో విరాట్ కోహ్లీ కేవలం ఆటగాడిగానే కనిపిస్తాడు.. కెప్టెన్‌గా కనిపించడు. వన్డేలు, టెస్టులకు మాత్రం విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగుతాడు. ఈ విషయాన్ని స్వయంగా విరాట్ కోహ్లీ ధృవీకరించాడు.
Virat Kohli Captaincy.. మనసులో మాట.?
అన్నట్టు, విరాట్ కోహ్లీ.. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడనీ, వన్డేలకీ అలాగే టీ20 పోటీలకు తాను కెప్టెన్‌గా వుండాలనుకోవడంలేదన్న విషయాన్ని ఇటీవల సన్నిహితులతో వెల్లడించాడనీ, టెస్టులకు మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతాడని కొద్ది రోజుల క్రితమే ఊహాగానాలు వచ్చాయి.
రోహిత్ శర్మ నుంచి ఎదురవుతున్న పోటీ, ఆ కారణంగా తలెత్తుతున్న ఒత్తిడి నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ ఇలా ఆలోచిస్తున్నాడని కొందరు.. కాదు కాదు, కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతల్లో కోత విధించాలని బీసీసీఐ పెద్దలే నిర్ణయం తీసుకుందని ఇంకొందరు.. తమకు తోచిన రీతిలో ప్రచారం చేశారు.
ఇంతకీ ఆ ఒత్తిడి రాజకీయం ఎవరిది.?
ఇండియన్ క్రికెట్లో ఇలాంటి రాజకీయాలు కొత్తేమీ కాదు. ఎప్పటినుంచో నడుస్తున్నవే. దోనీ విషయంలో కూడా ఇలాంటి రాజకీయాలు గతంలో నడిచాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ వంతు. పెద్దగా తేడా లేదంతే. ఒక్కటి మాత్రం నిజం.. మూడు ఫార్మాట్లకూ కెప్టెన్‌గా వుండడమంటే చాలా ఒత్తిడితో కూడుకున్న పని.
మొత్తమ్మీద, విరాట్ కోహ్లీ మంచి నిర్ణయమే తీసుకున్నాడు. అలాగని, ఇకపై అతనికి ఒత్తిడి తగ్గుతుందా.? అంటే, ప్రతి మ్యాచ్ విషయంలోనూ విరాట్ కోహ్లీ (Virat Kohli Captaincy) మీద ఒత్తిడి ఒకేలా వుంటుంది.. ఏమాత్రం తగ్గే ప్రసక్తే వుండదు.