Table of Contents
సినీ నటుడు ప్రకాష్ రాజ్ వామపక్ష భావజాలమున్న వ్యక్తి. గతంలో లోక్ సభకు పోటీ చేశారు కర్నాటక నుంచి. ఓడిపోయారు కూడా. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అలాగని రాజకీయాల నుంచి తప్పుకుంటారా.? మరి, ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో ఓడిపోయినంతమాత్రాన ‘మా’ సభ్యత్వం (Prakash Raj) వదులుకోవడమేంటి.?
రాజకీయాల్లో ఓడిపోయినంత మాత్రాన రాజకీయాల నుంచి తప్పుకోను.. అలాగే, ‘మా’ ఎన్నికల్లో ఓడిపోయినంతమాత్రాన సినిమాల నుంచి తప్పుకోను.. అని ప్రకాష్ రాజ్ చెప్పడాన్ని స్వాగతించాల్సిందే. కానీ, ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా ప్రకాష్ రాజ్ ఏం సంకేతాలు పంపుతున్నట్టు.?
చేజార్చుకున్న ప్రకాష్ రాజ్
‘మా’ ఎన్నికల నేపథ్యంలో అత్యద్భుతమైన అవకాశాన్ని ప్రకాష్ రాజ్ చేజార్చుకున్నారు. గెలవడం కోసం పెద్దల్ని కలవాలి. అది సినీ పెద్దలకు ఇచ్చే గౌరవం అవుతుంది తప్ప, బానిసత్వం కానే కాదు. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ చేసిన ‘తప్పు’ ఆయన్ని ఓడిపోయేలా చేసింది.
Also Read: నిస్సిగ్గు సినీ రాజకీయ డ్రామా అవసర‘మా’.?
స్థానికత లేదా ప్రాంతీయత తెరపైకొచ్చినప్పుడు, ‘నేను నేషనల్ అవార్డ్ తెచ్చాను.. నా కంటే తెలుగు ఎవడు బాగా మాట్లాడగలడు.?’ వంటి అవసరం లేని ప్రస్తావనలు తీసుకొచ్చి, తెలుగు ఆత్మగౌరవాన్ని నిజంగానే ప్రకాష్ రాజ్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అది ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది.
సరే, గెలుపోటములకు కారణాలు తీస్తే అదో పెద్ద చాంతాడంత వుంటుంది. డబ్బు ప్రభావం, కులం, మతం, ప్రాంతం.. వాట్ నాట్.. అన్నీ ప్రయోగింపబడ్డాయి ‘మా’ ఎన్నికల్లో. సాధారణ రాజకీయాల్లో కనిపించే ‘చెత్త’ అంతా ఇక్కడా కనిపించింది. కానీ, ఇప్పుడే ప్రకాష్ రాజ్ మరింతగా పోరాటం చేయాల్సి వుంది ‘మా’ సభ్యుడిగా.
తొక్కిపడేయడం సర్వసాధారణమిక్కడ..
కానీ, ‘మా’ అనేది చాలా చిన్న వ్యవహారం. అందులో ఎంత పోరాటం చేసినా ఉపయోగముండదు. ఎందుకంటే, ఆ పోరాటానికి విలువ వుండదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ‘తొక్కిపడేయడం’ అనేది జరుగుతుందిక్కడ. సినిమా నటుడిగా కొనసాగాలంటే, ఆ తొక్కిపడేసే వ్యవహారాలకు దూరంగా వుండాలి. అందుకే, తెలివిగా ‘మా’ సభ్యత్వం నుంచి ఆయన తప్పుకున్నాడు.
Also Read: జస్ట్ ఆస్కింగ్.. పవన్‌పై ప్రకాష్‌రాజ్‌కి ఈ ద్వేషమేల?
దీన్ని పారిపోవడం అనొచ్చు.. ఇంకేమైనా అనొచ్చు.. కానీ, ప్రకాష్ రాజ్ సరైన వ్యక్తి కాదు ‘మా’ అధ్యక్ష పీఠానికి అనే మాట అయితే ఇప్పుడు ఇంకోసారి గట్టిగా నిరూపితమైపోయింది. చిత్రమేంటంటే, ప్రకాష్ రాజ్‌ని ‘మా’ కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు ఓదార్చుతున్నారు. మనం కలిసి పని చేద్దామని పిలుపునిస్తున్నారు. ‘మా’ సభ్యత్వానికి చేసిన రాజీనామా ప్రకాష్ రాజ్ వెనక్కి తీసుకోవాల్సిందిగా మంచు విష్ణు కోరుతున్నాడు.
ఆరోపణలన్నీ హంబక్..
సో, సినిమా రంగంలో రాజకీయ అవసరాల కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మీద ఆరోపణలు చేశాడు తప్ప, మంచు విష్ణు ఆరోపణల్లో వాస్తవం ఇసుమంతైనా లేదన్నమాట. మంచు విష్ణు మాటల్ని నమ్మి, ప్రకాష్ రాజ్‌కి వ్యతిరేకంగా, మంచు ప్యానెల్‌కి అనుకూలంగా ఓట్లేసినోళ్ళంతా ఇప్పుడు వెర్రి వెంగళప్పాయ్లనే అనుకోవాలా.? అన్నది సగటు సినీ జీవి ఆవేదన.
Also Read: ‘మా’ ఎన్నికలు.. లోకల్ Vs నాన్ లోకల్.. తప్పెవరిది.?
ప్రకాష్ రాజ్ మాత్రమే కాదు, నాగబాబు కూడా ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అసలు రాజీనామా చెయ్యాల్సిన అవసరమేంటి.? పారిపోవడం పిరికితనం. దానికి ఎన్ని కుంటిసాకులు చెప్పినా అర్థం పర్థం వుండదు.