తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి నలుగురు అగ్ర హీరోలు అనగానే, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున (Akkineni Nagarjuna), వెంకటేష్ పేర్లు ఠక్కున గుర్తొస్తాయి. చిరంజీవి తనయుడు రామ్ చరణ్, తండ్రిని మించిన తనయుడు అనిపించేసుకున్నాడు. బాలకృష్ణ, వెంకటేష్ వారసులు ఇంకా తెరంగేట్రం చేయలేదు.
నాగార్జున కుమారుల్లో పెద్దవాడైన నాగ చైతన్య ఓకే అనిపించుకున్నాడు. చిన్నోడు అఖిల్ నిన్న మొన్నటి దాకా స్ర్టగుల్ అవుతూ వచ్చాడు.
అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేయడంతో అక్కినేని అభిమానుల్లో సంబరాలు మిన్సంటుతున్నాయ్.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ నాగ చైతన్యకు అద్భుతమైన విజయాన్ని అందిస్తే, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ అంటూ యంగ్ అక్కినేని అఖిల్ కూడా సత్తా చాటేశాడు.
పర్సనల్ లైఫ్ అలా.. కెరీర్ ఇలా..
ముచ్చటైన బంధం అనూహ్యంగా తెగిపోవడంతో నాగ చైతన్య ఒకింత డిప్రెషన్కి గురయ్యే ఉంటాడు. సమంత నుంచి విడిపోవడం నాగ చైతన్యకే కాదు, సమంత తమ కుటుంబానికి దూరమవడం పట్ల నాగార్జున కూడా చాలా ఆవేదన చెందాడు. అయితే, ఆ ఆవేదన నుంచి ‘లవ్ స్టోరీ’ సక్సెస్ కొంత ఊరటనిచ్చింది. ఆ వెంటనే అఖిల్ కూడా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో హిట్ కొట్టడంతో నాగార్జున డబుల్ హ్యాపీ.
Also Read: సమంత, నాగచైతన్య మధ్యలో అతనెవ్వడు.?
నాగ చైతన్య కావచ్చు.. అఖిల్ కావచ్చు.. తండ్రికి తగ్గ తనయులు అనిపించుకోవడానికి ఇంకా చాలా దూరమే పయనించాలి. సరైన సబ్జెక్ట్ పడితే, తండ్రికి తగ్గ తనయులేంటీ.? తండ్రిని మించిన తనయులు అనిపించుకోవడం వీళ్లిద్దరికీ పెద్ద కష్టమేమీ కాదు. ఆ రోజెంతో దూరంలో లేదని అక్కినేని అభిమానులు అంటున్నారు.
అటు నాగచైతన్య చేతిలోనూ, ఇటు అఖిల్ చేతిలోనూ మంచి మంచి ప్రాజెక్టులే వున్నాయిప్పుడు. సో, కింగ్ నాగ్ (Akkineni Nagarjuna) వారసులు బాక్సాఫీస్ వద్ద మరింతగా సందడి చేసే రోజులు ముందు ముందు వున్నాయన్నమాట.