India Vs Pakistan.. టీ20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో.. తొలి మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ సేన పరాజయం పాలయ్యింది.. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో. ప్రపంచ కప్ ఫార్మాట్ విషయానికొస్తే, టీమిండియా ఇప్పటిదాకా పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలయ్యింది లేదు. తొలిసారిగా ఈ ఫార్మాట్‌లో టీమిండియా చేదు అనుభవాన్ని చూసింది పాకిస్తాన్ చేతిలో.
నిజం చెప్పుకోవాలంటే పాకిస్తాన్ జట్టుకి ఇదొక అత్యద్భుత విజయం. ఎన్నో ఏళ్ళుగా టీమిండియాపై వరల్డ్ కప్ వేదికల్లో విజయం సాధించాలని కలలుగన్న పాకిస్తాన్, ఎట్టకేలకు ఆ విజయాన్ని అందుకుంది. టీమిండియాకి మాత్రం ఇది వెరీ వెరీ బ్యాడ్ డే.!
India Vs Pakistan ఎందుకు ఓడిపోయింది టీమిండియా.?
ఆట అన్నాక గెలుపోటములు సహజం. పాకిస్తాన్ చేతిలో ఓటమి.. అనగానే జీర్ణించుకోవడం కష్టం. అయితే, టీమిండియా ఇటీవలి కాలంలో చాలా ఎక్కువ క్రికెట్ ఆడింది. ఆటగాళ్ళలో చాలామంది అలసిపోయారు. ఇటీవలి ఐపీఎల్ కూడా ఆటగాళ్ళ మీద శారీరకంగా చాలా ఒత్తిడి తెచ్చిందనే చెప్పాలి.

ఐపీఎల్ పూర్తయిన వెంటనే.. అదీ కొద్ది రోజుల్లోనే వరల్డ్ కప్ పోటీలకు సిద్ధమవడం ఓ రకంగా ప్లస్.. ఇంకో రకంగా ప్లస్. కారణాలు వెతుక్కోవాల్సిన పనిలేదు. టీమిండియా ఓటమి పాలైంది. అయితే, ఈ ఓటమితో కుంగిపోయే ప్రసక్తే వుండదు.. మెన్ ఇన్ బ్లూ.. ఇప్పటికీ టైటిల్ ఫేవరెట్.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
బౌలింగ్.. బ్యాటింగ్ ఇలాగేనా.?
అయితే, ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేనంత ‘చేవలేని బౌలింగ్’ చేయడం.. భారత క్రికెట్ అభిమానుల్ని తీవ్రంగా కలచి వేస్తోంది. బీసీసీఐకి సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి అక్షింతలు పడిపోతున్నాయి. ఆటగాళ్ళ మీదా విమర్శలు షురూ అయ్యాయి.
Also Read: Love Story Review.. లవ్ స్టోరీ రివ్యూ.!
151 పరుగులు చేసిన టీమిండియా.. ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు కనీసం ప్రయత్నించకపోవడం ఆశ్చర్యకరం. అదే సమయంలో కోహ్లీ మినహా దాదాపుగా టీమిండియా బ్యాట్స్‌మెన్ అంతా వైఫల్యం చెందడం శోచనీయం. పాక్ బౌలింగ్ బాగుంది.. టీమిండియా బౌలింగ్ చెత్తగా తయారైంది.. భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు.. పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ (India Vs Pakistan) సత్తా చాటారు.
ఈ వైఫల్యం టీమిండియాకి ఓ గుణపాఠం కావాలి.. ఓటమి నుంచి పుంజుకోవడమెలాగో టీమిండియాకి బాగా తెలుసు. ఈ టోర్నీలో మిగతా మ్యాచ్‌లలో సత్తా చాటి, భారత క్రికెట్ అభిమానుల్ని మెన్ ఇన్ బ్లూ ఉర్రూతలూగిస్తారనే ఆశిద్దాం.