Payal Rajput Food Philosophy.. పాయల్ రాజ్‌పుత్ అంటే, ముందుగా గుర్తొచ్చేది బోల్డ్, బ్యూటిఫుల్ అండ్ ‘రా’ లవ్ స్టోరీ ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా. సరే, ఈ భామలో అందం, నటన.. ఇవే కాదు, వీటితోపాటూ చాలా రకరకాల టాలెంట్స్ ఉన్నాయన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం.
తెరపై అందాలారబోతతో రెచ్చిపోయే పాయల్ రాజ్‌పుత్ ఓ పెద్ద తిండిపోతు అట. అదేనండీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్లని అలాగే కదా పిలుస్తుంటాం. కాస్త ట్రెండీగా చెప్పుకోవాలంటే ఫుడ్ లవర్ అన్నమాట. అయితే, తన ఇష్టాన్ని ఈ నాజూకు అందాల సుందరి నిస్సంకోచంగా చెప్పేస్తోంది.
Payal Rajput Food Philosophy ఫుడ్‌కీ ఫిట్‌నెస్‌కీ సంబంధమే లేదట..
అఫ్‌కోర్స్.. ‘సిగ్గు’ అనే మాటకు ఈ హాట్ బ్యూటీ చాలా దూరమనుకోండి. ఇక పాప ఫుడ్ లవింగ్ విషయానికి వస్తే.. రకరకాల ఫుడ్స్ టేస్ట్ చేయడంలో ఉండే మజానే వేరప్పా అంటోంది. షూటింగ్స్ నుండి కాస్త టైమ్ దొరికినా చాలు.. ఏధో ఒక రెస్టారెంట్‌లో వాలిపోవాల్సిందేనట.

అక్కడి స్పెషల్ వంటకాలేంటో అడిగి మరీ తెలుసుకుని చకచకా లాగించేస్తుందట పాయల్ రాజ్‌పుత్. విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ట్రెడిషనల్ ఫుడ్స్‌ని బాగా ఇష్టపడుతుందట.
అయ్యో ఇదేం పైత్యం రా బాబూ.. అంతలా తింటే, లావైపోరూ.. అంటారా.? తిన్నది అరిగించుకోవడం కోసం జిమ్స్, బాడీ వర్కవుట్స్ ఎలాగూ ఉన్నాయనుకోండి.
Payal Rajput రెస్టారెంట్ కహానీ..
బతికేది ఆ తిండి కోసమే.. అలాంటిది నచ్చింది తినకపోతే, ఈ బతుకే దండగ అని ఫిలాసఫీ కూడా ఇచ్చేస్తోంది అందాల పాయల్ రాజ్‌పుత్. ఇక్కడ గమనించాల్సిందేమంటే, ఎక్కువగా బాయ్ ఫ్రెండ్‌తో కలిసి రెస్టారెంట్స్‌కి వెళ్లడం తనకెంతో ఇష్టమంటోంది పాయల్ రాజ్‌పుత్.
ఫినిషింగ్ టచ్ అదిరింది కదా. ‘ఆర్‌ఎక్స్ 100’ అంత ఘాటుగా లేదూ. దటీజ్ పాయల్ రాజ్‌పుత్.
Also Read: Ashu Reddy కాన్ఫిడెన్స్.. హాటుగా ఘాటుగా.?