Jacqueline Fernandez పబ్లిసిటీ కోసం.. పాపులారిటీ పెంచుకోవడం కోసం.. ఏ అడ్డదారైనా తొక్కడానికి కొందరు సినీ సెలబ్రిటీలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. హీరోలతో లింకులు అంటగట్టి, గాసిప్పులు సృష్టిస్తే, వాటిని ఎంజాయ్ చేసేవాళ్లూ ఉంటారు. ఆ గాసిప్పుల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేవాళ్లూ ఉంటారు. అందుకే ఆ గాసిప్పులకి అంత క్రేజ్.
కొన్నిసందర్భాల్లో సినీ సెలబ్రిటీలు డబ్బులిచ్చి మరీ గాసిప్పులు రాయించుకుంటారనే అపప్రద కూడా వుండనే వుంది. ఏది నిజం.? అనేది వేరే చర్చ. అసలు విషయానికి వస్తే, శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ నటి జాక్వెలైన్ ఫెర్నాండెజ్ కొత్త చిక్కుల్లో పడింది. ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తోందంటూ, గత కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయ్.
ఈ పబ్లిసిటీ.. కొంప ముంచేస్తోంది.!
తాజాగా జాక్వెలైన్, ఆ వ్యక్తితో ఏకాంతంగా వున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాకి ఎక్కాయ్. దాంతో జాక్వెలైన్కి ఒళ్లు మండింది. అలాంటి ఫోటోలతో దుష్ర్పచారం చెయ్యొద్దంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. మామూలుగా అయితే, ఇలాంటి గాసిప్స్‌ని జాక్వెలైన్ పట్టించుకోదు.

సల్మాన్ ఖాన్ సహా, పలువురితో ఈ బ్యూటికి ఎఫైర్లు కట్టేస్తూ కుప్పలు తెప్పలుగా గాసిప్పులొచ్చాయ్. అప్పుడెప్పుడూ ఇంతలా స్పందించని జాక్వెలైన్ ఇప్పుడిలా స్పందించడానికి బలమైన కారణముంది. అదేంటంటే, జాక్వెలైన్కి, ఏ వ్యక్తితో ఎఫైర్ వుందని అంటున్నారో, ఆ వ్యక్తి బాలీవుడ్‌ని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో నిందితుడు.
Also Read: సిగరెట్టు.. అందాల భామల కనికట్టు.!
జాక్వెలైన్ కూడా డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోంది. అందుకే, ఇంతలా వర్రీ అయ్యింది. రియా చక్రవర్తి సహా పలువురు బాలీవుడ్ నటీ మణులు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ, జాక్వెలైన్ ఇంకాస్త ఎక్కువ సెగ ఎదుర్కొంటోంది. అందుకే, ఇప్పుడు ఎదురవుతున్న పాపులారిటీ, పబ్లిసిటీ అస్సలు జీర్ణించుకోలేకపోతోందామె.