Table of Contents
Birth Place Of Hanuman.. హనుమంతుడు.. ఆంజనేయుడు..పేరేదైనా అతి బలవంతుడు. ఇంతకీ హనుమంతుడు ఎక్కడ పుట్టాడు.? ఇదేం ప్రశ్న.? హనుమంతుడు దేవుడు. ఆ దేవుడెక్కడ పుట్టాడో మనమెలా చెప్పగలం.
పురాణాలు, ఇతిహాసాలూ, ఇవన్నీ తిరగేస్తే, ఏం సమాధానం దొరుకుతుందో కానీ, ఆంజనేయుడు జన్మస్థలంపై బోలెడంత రచ్చ జరుగుతోందే తప్ప రావాల్సని స్పష్టత అయితే రావట్లేదు.
Birth Place Of Hanuman అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలమా.?
తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల ‘అంజనాద్రి’ని ఆంజనేయుడి జన్మస్థలం అని పేర్కొంది. ఇదే పక్కా.. అంటూ బర్త్ సర్టిఫికెట్, నేటివిటీ సర్టిఫికెట్ ఇచ్చేసినట్లుగా హడావిడి అయితే జరిగింది. ఇదిగో సాక్ష్యాలూ అంటూ కొన్ని వివరాల్ని టీటీడీ పేర్కొంది.
ఇంతకీ హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ చేసిన నిర్ధారణలో నిజమెంత.? ముందే చెప్పుకున్నాం. హనుమంతుడు భగవంతుడు. ఆ భగవంతుడు సర్వాంతర్యామి. ఒక్కచోటుకే ఆ దేవుణ్ని పరిమితం చేయడం ఎంతవరకూ సబబు.?
సందట్లో సడేమియా అంటూ కిష్కింద ప్రాంతంలోనే హనుమంతుడు (Birth Place Of Hanuman) జన్మించినట్లు ఇంకొందరు ఆధారాలు చూపిస్తున్నారు. ఏంటీ వైపరీత్యం. దేవుడు వున్నాడా.? లేదా.? అన్నదానిపై ఓ పక్క చర్చోపచర్చలు జరుగుతున్నాయ్.
Hanuman Birth Place ఆంజనేయ స్వామి ఎవరివాడు.?
ఇంకోపక్క, హనుమంతుడు ఇక్కడే పుట్టాడంటూ.. రెండు గ్రూపుల మధ్య గొడవలు జరుగుతున్నాయ్. సభ్య సమాజం హర్షించే విషయాలు కావివి. మనమెవరం.? దేవుడు పుట్టు పూర్వోత్తరాల్ని నిర్ణయించడానికి. మనకేం హక్కుందని పలానా చోటే పుట్టాడని ప్రకటనలు చేసేయడానికి.

నవ్విపోదురు గాక మనకేటి సిగ్గు.. అన్నట్లు తయారైంది పరిస్థితి. భగవంతుడు సర్వాంతర్యామి. ఎక్కడైనా వుంటాడు. తలచినంతనే మనసులో వుంటాడు. ఇంట్లోని పూజ గదిలో కొలువై వుంటాడు.
నిర్మలమైన చిత్తంతో దేవున్ని పూజించాలి. కానీ, నువ్వెక్కడ పుట్టాడో నేను చెబుతా.. అంటూ దేవున్ని అవమానపరిచే పనులు పక్కన పెడితే మంచిది.
అయోధ్య రాముడికే తప్పలేదు.!
హనుమంతుడికే కాదు.. హనుమంతుడి బాస్.. అదేనండీ శ్రీరామచంద్రుడికి కూడా ఈ సమస్య తప్పలేదు. శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడని కొందరు.. కాదు కాదంటూ ఇంకొందరు. వెరసి, అప్పట్లో అదో పెద్ద వివాదం. అప్పటికీ, ఇప్పటికీ ఆ వివాదం అలా అలా నానుతూనే వుంటుంది.
రాముడేనా.? శీకృష్ణుడు సైతం ఇలానే ‘జన్మస్థలం’ వివాదాన్ని ఎదుర్కొన్నాడు. అయినా, దేవుళ్ళు వివాదాల్లో ఇరుక్కోవడమేంటి.? అదో తుత్తి జనాలకి. ‘అనవసరమైన విషయాల గురించి రచ్చ చేయడం పద్ధతి కాదు..’ అని పెద్దలు చెప్పిన మాటల్ని ఎప్పుడో పెడచెవిన పెట్టేశాం.!
పండగలు, పబ్బాల్ని సైతం వదలని మేధావులు.!
సంక్రాంతి పండగ ఫలానా రోజున చేసుకోవాలని ఒకరంటే, అదెలా చేస్తారు.? ఆ ఘడియలు సరిగ్గా లేవంటూ ఇంకొందరు వితండ వాదానికి దిగుతారు. షరా మామూలుగానే ఇలాంటి వివాదాలకి ఎలక్ట్రానిక్ మీడియా అమితమైన ప్రాధాన్యతనిస్తుంటుంది.
Also Read: కొత్త రాజ్యాంగం రాస్కో బాసూ.! ఇంతకీ, ఏ సిరాతో.!
యూ ట్యూబ్ ఛానళ్ళ పుణ్యమా అని ప్రతి చిన్న విషయమూ వివాదమే. అలాంటి వివాదాలంటే జనాలకి కూడా బోల్డంత ఎంటర్టైన్మెంట్ అయిపోయిందిప్పుడు.
ఔను, కాదేది వివాదానికి అనర్హం. ఆ దేవుడే దిగొచ్చి, నేను దేవుడినని చెప్పినా.. ఫలానా చోట పుట్టానని చెప్పినా జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. ‘నేనేయ్యా మీ ఆంజనేయస్వామిని..’ అని హనుమంతుడు ఒకవేళ జనం ముందుకొచ్చి అన్నాడే అనుకుందాం.. ‘ప్రూఫ్ ఏదీ.?’ అని నిలదీసే జనాలున్న రోజులివి.!