Table of Contents
Malli Modalaindi Review.. వైవాహిక జీవితంలో మనస్పర్దలు మామూలే. చిన్నచిన్న సమస్యలు ముదిరి పాకాన పడి సరిదిద్దుకోలేనంత తీవ్రమైన ఇబ్బందులుగా మారి, చివరికి ఆలుమగలు విడాకుల ద్వారా వేర్వేరు దారుల్ని చూసుకోవల్సి రావచ్చు. ఈ కాన్సెప్టుతో కుప్పలు తెప్పలుగా సినిమాలొచ్చాయ్.
నిజానికి, ఆలుమగల చుట్టూ ఎన్ని కథలైనా రాసుకోవచ్చు. ఎన్ని సినిమాలైనా తీసుకోవచ్చు. ఆధ్యంతం మనసుల్ని కోసి పాడేసేలా సెంటిమెంట్‌తో నింపేయొచ్చు. టైటిల్స్ దగ్గర్నుంచి, ఎండ్ కార్డ్ వరకూ వినోదంలోనూ ముంచెత్తేయొచ్చు. అక్రమ సంబంధాలు సహా దేన్నయినా ఈ కథల్లో ఇరికించేయొచ్చు.
ఇంతకీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న‘మళ్లీ మొదలైంది’ సినిమా సంగతేంటట. దాని గురించే చర్చించుకుందాం పదండి.
సుమంత్ హీరోగా నైనా గుంగూలీ, వర్షిణీ సౌందరాజన్ కథా నాయికలుగా రూపొందింది ఈ ‘మళ్లీ మొదలైంది’ సినిమా. సీనియర్ నటి సుహాసిని, పోసాని కృష్ణ మురళి, పావని, వెన్నెల కిషోర్, సరయు తదితరులు ఇతర ప్రధాన తారాగణం.
Malli Modalaindi Review.. ఇదీ ‘మళ్ళీ మొదలైంది’ కథ.!
విక్రమ్ (సుమంత్), అతని భార్య నిషా (వర్షిణి) మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయ్. ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ వైవాహిక బంధాన్ని కొనసాగించలేమనే నిర్ణయానికి వచ్చి విడాకుల కోసం కోర్టునాశ్రయిస్తారు. వీరిద్దరి విడాకుల ప్రక్రియలో పవిత్ర (నైనా గంగూలీ) తారసపడుతుంది.
విడాకులు మంజూరవుతాయి. కాగా, న్యాయవాద వృత్తిని పక్కన పెట్టి ‘రీ సెట్’ అనే సంస్థని స్థాపిస్తుంది పవిత్ర. పవిత్రకు మన హీరో విక్రమ్ కనెక్టవుతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. నిషాతో విడాకుల నేపథ్యంలో పవిత్రతో పెళ్లికి భయపెడతాడు విక్రమ్. తర్వాత ఏమవుతుంది.? విక్రమ్ మళ్లీ ఒంటరవుతాడా.? పవిత్ర ప్రేమ ఏమవుతుంది.? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులెవరికీ అత్యద్భుతమైన నటనా ప్రదర్శన ఇచ్చేయాల్సినంత అవసరం అయితే రాలేదు. ప్రధాన పాత్రలన్నీ అలా అలా తెరపై తమ పని తాము చేసుకుంటూ పోతాయ్. కొంచెం ఎమోషన్.. కాసిన్ని నవ్వులు, చిన్నపాటి సస్పెన్స్.. ఇలా సినిమా సజావుగానే నడిచింది.
రీ సెట్ అనే కాన్సెప్టుతో సినిమా కథ మొత్తాన్ని అల్లుకోవడం బాగానే వుంది కానీ, ఇంకాస్త ఎలివేట్ అయ్యేలా ఆ కాన్సెప్టును ప్రజెంట్ చేసి వుండాల్సింది. అక్కడక్కడా హీరోని డీలా పడేలా చేసేయడం ఎందుకో అర్ధం కాదు. జోవియల్‌గా హీరో క్యారెక్టర్ని తీర్చిదిద్ది వుంటే బోలెడంత ఫన్ జనరేట్ అయ్యి వుండేది.
Malli Modalaindi Review.. సుమంత్ అలా కానిచ్చేశాడు.!
నటీనటుల విషయానికి వస్తే, సుమంత్ అలా అలా తన పని చేసుకుపోయాడు. ముందే చెప్పుకున్నాం కదా.. ఇంకాస్త జోష్ అవసరం విక్రమ్ పాత్రకి. నైనా గంగూలీ స్ర్కీన్ ప్రెజెన్స్ బాగానే వుంది. బాగానే చేసింది కూడా. వర్షిణి బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయ్యాకా వచ్చిన పెద్ద అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకుంది. పావని ఓకే.
సుహాసినికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. పోసాని కృష్ణ మురళి కొత్తగా చేసిందేమీ లేదు. రొటీన్ రోల్ దక్కిందాయనకి. వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్.
Also Read: Valentines Day: ఎందుకు ప్రేమించాలి.? ఎలా ప్రేమించాలి.?
సాంకేతిక అంశాల విషయానికి వస్తే, డైలాగ్స్ బాగున్నాయ్. మరీ ముఖ్యంగా వెన్నెల కిషోర్ చుట్టూ రాసిన పంచ్ డైలాగులు బాగా పేలాయ్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ ఓకే. మ్యూజిక్ సినిమాకి తగ్గట్లుగా వుంది.
ఆ విషయంలో అభినందించాల్సిందే.!
కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా, సజావుగా కథనం నడిపించడంలో దర్శకుడు కొంతమేర సక్సెస్ అయ్యాడు. హాస్యాన్ని వీలైనంత వరకూ బాగానే వాడేశాడు. రిస్కీ అటెంప్ట్స్ చేయలేదు. బలవంతంగా కమర్షియల్ అంశాల్ని కలిపేయలేదు. గ్లామర్ విషయంలో ఓవర్ ది బోర్డ్ వెళ్లిపోలేదు.
సినిమా అంటే అధర చుంబనాల సహా అడ్డమైన చెత్తా వుండాల్సిందే.. అని అనుకోలేదు. ఈ సినిమాకి, ఈ కథకి ఎంత వుండాలో అంతవరకే సరిపెట్టేశాడు. ఆ విషయంలో దర్శకున్ని అభినందించాలి. ఓటీటీ బొమ్మ కాబట్టి సరదాగా ఓ సారి లుక్కేయొచ్చు. ఓసారేంటీ.. ఇంకోసారి చూసినా టైమ్ పాస్ (Malli Modalaindi Review) అయిపోద్ది.
చివరగా.. ధియేటర్లకు వెళ్లి చూసేంత స్పెషల్ కంటెంట్ ఏమీ సినిమాలో లేదు.
