Aamir Khan Divorce Love: మూడు ‘ముల్లు’ గుచ్చేసుకుంటాయ్.! ఆ బంధం బద్దలైపోతే, ఎంచక్కా ప్రాణ స్నేహితుల్లా కలిసి మెలిసి వుండొచ్చునట.
ఈ కొత్త సిద్ధాంతం చెబుతున్న మేధావి ఎవరో తెలసాండీ.! బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్టు ఆమిర్ ఖాన్ (Aamir Khan). మొన్నీమధ్యనే తన రెండో భార్య కిరణ్ రావు (Kiran Rao) నుంచి విడాకులు తీసుకున్నాడీ ‘మగా’నుభావుడు.!
ఇంతకీ, ఇప్పుడీ ‘పుణ్య’ పురుషుడి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామో తెలుసా.?
కలిసి కలహాల కాపురం చేయలేక, భార్య పోరు పడలేక వైవాహిక బంధాన్ని తెగ్గోసుకున్న ఆమిర్ ఖానుడికి, ఆ మాజీ భార్య ఇప్పుడు గొప్ప స్నేహితురాలిలా కనిపిస్తోందిట.
అంతే కాదు, శ్రేయోభిలాషిలా విలువైన సలహాలు కూడా ఇచ్చేస్తోందట.. అలాగని స్వయంగా అమీర్ ఖాన్ చెప్పాడండీ.!
Aamir Khan Divorce Love.. ఇది మూడ్ అండ్ ‘ముల్లు’ బంధం.!
ఎట్టెట్టా! మూడు ముళ్ళ బంధం ‘ముల్లు’లాగా గుచ్చేసుకుందా.? ఆ బాధ భరించలేక, భార్య నుంచి విడాకులు తీసుకున్నాడా.? ఇప్పుడేమో ఆ భార్య, విలువైన సలహాలిచ్చేస్తోందా.? అవి తనను తాను మంచి మనిషిగా మార్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయా.?
వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పేటోడు సిద్దాంతి అని పెద్దోళ్ళు ఊరకనే అనలేదండీ.! ఇదిగో ఇలాంటి ‘మగా’నుభావులు పుట్టుకొస్తారనే బహుశా పెద్దలు అలా అంచనా వేసి వుంటారు, భవిష్యత్ తరాల్ని అప్రమత్తం చేసి వుంటారు.
ఇద్దరి మనస్తత్వాలు ఒక్కటిగా అనిపించినప్పుడు, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడినప్పుడే స్నేహం పుడుతుంది. ఆ తర్వాత ఆ స్నేహం ఇంకాస్త బలపడితే, ఆరాధనా భావమవుతుంది.. ఆడ, మగ మధ్య ఆకర్షణ ఏర్పడుతుంది.
ఆ ప్రేమ లెక్కలు వేరే వున్నాయ్.!
ఆగండాగండీ, ఈ మధ్య ఆడ – ఆడ, మగ – మగ మధ్య కూడా ఆకర్షణ ఏర్పడుతోంది లెండి, అది వేరే వ్యవహారం. ఆకర్షణ కాస్తా ప్రేమగా మారి, పెళ్ళికి దారి తీస్తుంది. పెళ్ళి తర్వాత వైవాహిక జీవితంలో కలిసి ముందడుగు వేయలేనంతగా మనస్పర్ధలు వస్తే విడిపోతారు. ఇదీ సాధారణంగా జరిగేది.
Also Read: సమంత అందాల దాడి.! ఊ అంటారా.. ‘నో’ అనగలరా.!
విడిపోయాక, పిల్లల కోసం స్నేహితుల్లా వుండటం తప్పు లేదుగానీ, అభిప్రాయ బేధాలతో విడిపోయినోళ్ళు ఒకర్నొకరు సంస్కరించుకునే స్థాయికి ప్రేమాభిమానాల్ని, ఆరాధనా భావాల్ని కలిగి వుండడమే విచిత్రం. అంత గొప్ప అనుబంధం వుంటే ఎందుకు విడిపోతారు?
మేధావులు మిస్టర్ పెర్ఫెక్షనిస్టులని అనిపించుకోవాలంటే ఇదిగో ఇలాంటి పనికిమాలిన పనులు చేయాలి, అంతకన్నా పనికిమాలిన కవరింగు డైలాగులూ ఇవ్వాలేమో.! కాలం మారింది.! ఔను, ఇది కలికాలం.!
			        
														