Saiee Manjrekar Tollywood: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సరసన ‘దబాంగ్ 3’ సినిమాలో నటించిన సయీ మంజ్రేకర్ గుర్తుంది కదా.? ఆమె ఇప్పడు తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది.
తొలి తెలుగు సినిమా ‘గని’ విడుదల కాకుండానే ఈ బాలీవుడ్ బ్యూటీకి తెలుగులో అవకాశాలు పోటెత్తాయ్. అంతలా ఆమెలో ఏం ప్రత్యేకత వుందని.?
ఇదే ప్రశ్నని సయీ మంజ్రేకర్ ముందుంచితే, ‘ఏమో, నాకూ తెలియదు.. బహుశా నన్ను తెలుగమ్మాయ్లా ఇక్కడి జనం ఫీలవుతున్నారేమో..’ అంటూ ఆస్తికరమైన వ్యాఖ్యలు చేసింది సయీ మంజ్రేకర్. ‘గని’ సినిమాలో వరుణ్ తేజ్ హీరో.
Saiee Manjrekar Tollywood.. తెలుగుపై మమకారం అలా.!
షూటింగ్ సమయంలో తెలుగులో మాట్లాడటం కొంతమేర అలవాటు చేసుకుందట. అసలు తెలుగు సినీ పరిశ్రమలోకి రావడానికి కారణం ఆమె తండ్రి మహేష్ మంజ్రేకర్ అట.

గోపీచంద్ హీరోగా వచ్చిన ‘ఒక్కడున్నాడు’, ‘అదుర్స్’ తదితర సినిమాల్లో మహేష్ మంజ్రేకర్ విలన్ రోల్స్ చేసిన విషయం విదితమే. ‘డాన్ శీను’, ‘అఖిల్’ తదితర సినిమాల్లోనూ నటించారాయన.
తెలుగు సినిమాల గురించి తన తండ్రి తన వద్ద చాలా గొప్పగా చెబుతుంటారనీ, అదే తెలుగు సినిమాల పట్ల తాను ఆసక్తిని పెంచుకోవడానికి కారణమయ్యిందనీ సయీ మంజ్రేకర్ చెప్పుకొచ్చింది.
ఆ డాన్స్ చూస్తే భయమేస్తోందట.!
‘డాన్స్‌ని చాలా ఇష్టపడతాను. కానీ, చరణ్ అలాగే ఎన్టీయార్.. నాటు నాటు పాట కోసం వేసిన డాన్స్ చూసి భయపడ్డాను.. వాళ్ళిద్దరితో డాన్స్ చేసే అవకాశమొస్తే అంతకన్నా అద్భుతం ఇంకేముంటుంది.?’ అని చెప్పుకొచ్చిందీ బాలీవుడ్ బ్యూటీ.
హిందీ, తెలుగు.. ఈ తేడాలిప్పుడు సినిమాల పరంగా లేవనీ, మొత్తంగా అంతా కలిసి ఇండియన్ సినిమా అయ్యిందనీ, హిందీలో సినిమాల నిర్మాణంతో పోల్చితే తెలుగులో సినిమాల నిర్మాణం వేగంగా జరుగుతుందని చెప్పింది సయీ మంజ్రేకర్.
Also Read: నిహారిక కూడా మీ ‘ఆడకూతురు’ లాంటిదే కదా.!
కోవిడ్ వల్ల చాలా సినిమాలు నిర్మాణంలో ఇబ్బందులు పడ్డాయనీ, ‘గని’ అందుకు మినహాయింపేమీ కాదని చెప్పిందీ అందాల భామ.
హిందీ, తెలుగుతో పాటుగా తమిళ సినిమాలు కూడా చేస్తానంటున్న సయీ మంజ్రేకర్ (Saiee Manjrekar), తెలుగు నేర్చుకోవడం ఎంతో ఆనందంగా వుందని చెబుతోంది.