Table of Contents
Anupama Parameswaran.. హీరోయిన్స్ అంటే ఫిజిక్ మెయింటైన్ చేయాలి తప్పదు. అందుకోసం జిమ్‌లూ, వర్కవుట్లూ వగైరా వగైరా.. అంటూ తమ అందాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ చేయాల్సిందే.
కానీ, ఈ ముద్దుగుమ్మ మాత్రం అస్సలు వర్కవుట్స్ చేయనంటోంది. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ.? ఏంటా కథ.?
‘రావణాసురుడి భార్య కూడా తన భర్త పవన్ కళ్యాణే’ అనుకుంటుంది..’ అంటూ ‘అ ఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.
‘ప్రేమమ్’ సినిమాతో మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన అనుపమ, అదే టైటిల్‌తో తెలుగులో రీమేక్ అయిన నాగచైతన్య సినిమాలోనూ హీరోయిన్గా నటించి మెప్పించింది.
అప్పుడు కాస్త ముద్దుగా.. ఇప్పుడు స్లిమ్ అండ్ స్వీట్‌గా.!
అయితే మొదట్లో కాస్త బొద్దుగా ముద్దుగా కనిపించిన అనుపమ పరమేశ్వరన్, ఇప్పుడు చాలా స్లిమ్ అండ్ స్లీకీగా కనిపిస్తూ, కొత్తగా వచ్చే ముద్దుగుమ్మలకు గట్టి పోటీ ఇస్తోంది.
‘రౌడీబాయ్స్’ సినిమా కోసం కొత్త హీరో ఆశిష్ రెడ్డితో జత కట్టింది అనుపమ. ఈ సినిమాలో అనుపమ పర్ఫామెన్స్తో పాటు, ఆమె ఫిజిక్ కూడా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
Anupama Parameswaran నో జిమ్.. నో వర్కవుట్స్
కష్టపడి వర్కవుట్స్ చేసి, అనుపమ భలే సన్నబడిందే అనుకున్నారంతా. కానీ, నిజానికి తాను ఎలాంటి ఎక్సర్సైజుల జోలికీ పోలేదంటోంది అందాల అనుపమ. జిమ్‌కి వెళ్లడం అనుపమకి అస్సలు ఇష్టముండదట.

డైట్ కంట్రోల్ చేసుకోవడం ద్వారా అందమైన ఫిజిక్ తన సొంతమైందని అంటోంది ముద్దుగుమ్మ అనుపమ. అలా అని.. అవి తీనకూడదు, ఇవి తినకూడదు.. అనే పట్టింపులతో పూర్తిగా నోరు కట్టేసుకోలేదట ఈ భామ.
పన్నీర్ ఫుడ్ ఇష్టం. కానీ..
పోషకాలున్న ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకున్నాననీ, జస్ట్ మార్నింగ్ ఈవెనింగ్ ఓ అరగంట వాకింగ్ చేశాననీ చెబుతోందీ అందాల అనుపమ.
అనట్టు పన్నీర్ ఫుడ్ అంటే అనుపమకి చాలా ఇష్టమట. పన్నీర్ తింటే లావైపోతారు అనే అపోహ చాలా మందిలో వుంటుంది.
Also Read: నిహారిక కూడా మీ ‘ఆడకూతురు’ లాంటిదే కదా.!
కానీ, దేనికైనా లిమిట్ వుంటుంది కదా. అలా లిమిట్లో తీసుకుంటే, ఏ ఫుడ్ అయినా ఒంటికి చెడు చేయదు, ఫిజిక్నీ పాడు చేయదు.. అంటూ స్వీట్ సజిషన్ ఇస్తోంది క్యూట్ అనుపమ.
డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటెమ్స్‌కి అనుపమ చాలా దూరంగా వుంటుందట. చికెన్, పన్నీర్ వంటివి తిన్నప్పుడు రెండో పూట భోజనం మానేస్తుందట అనుపమ పరమేశ్వరన్. అదే ఆమె స్లిమ్ సీక్రెట్ అనుకుంటా.