‘నువ్వు నాకంటే ఎందులోనూ తక్కువ కాదు. నువ్వు నామినేట్ అవమని నేను చెప్పలేను. ఎందుకంటే, నాతో సమానంగా అన్ని విషయాల్లోనూ పోటీకొస్తున్నావ్. సో, నేనే నామినేట్ అవుతున్నాను..’ అంటూ నామినేషన్స్ సందర్భంగా అలేఖ్య హారికకి స్పష్టం చేసేశాడు అబిజీత్ (Abijeet Saves Alekhya Harika).
ఈ సీజన్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే ఠక్కున అంతా చెప్పేది అబిజీత్ (Team Abijeet) గురించే. మోనాల్ విషయంలో కొన్ని హిక్కప్స్ మొదట్లో ఎదుర్కొన్నాడుగానీ, ఇప్పుడంతా క్లియర్. అస్సలు మోనాల్ వైపు చూడటంలేదు అబిజీత్.
Also Read: మోనాల్ సూపర్.. అఖిల్ ఫెయిల్యూర్.!
మోనాల్ – అబిజీత్లను (Monal Gajjar – Abijeet) కలపాలని అరియానా (Ariyana Glory) ప్రయత్నిస్తే, ‘ఆ ప్రయత్నం చేయొద్దు.. దండగ’ అని అబిజీత్ స్వయంగా తేల్చేశాడు. ‘రోబోట్స్ టాస్క్‌లో నా స్కెచ్ ఫలించింది. చాలా చోట్ల నీ స్టామినానే ప్రూవ్ అయ్యింది..’ అంటూ హారికని ఆకాశానికెత్తేయడం ద్వారా, ఆమెని గెలిపించి.. తానూ గెలిచాడు అబిజీత్.
ఇద్దరూ ఓ అండర్‌స్టాండింగ్‌కి వచ్చి నామినేట్ అవడం అనేది ఈ వారం నామినేషన్స్‌కి సంబంధించిన టాస్క్. మిగతా కంటెస్టెంట్స్ అందరూ కొంత మేర కన్ఫ్యూజన్లో వున్నారుగానీ.. అబిజీత్ మాత్రం చాలా క్లియర్‌గా వున్నాడు. వరుసగా నామినేట్ అవుతున్నాసరే, ధైర్యంగా నామినేషన్స్‌లోకి వెళ్ళాడు.
నిజానికి, వీక్స్ గడుస్తున్న కొద్దీ కాంపిటీషన్ టఫ్‌గా మారిపోతుంటుంది. ఇలాంటి సమయంలో ఎవరూ రిస్క్ తీసుకోవాలనుకోరు. అయితే, అబిజీత్ రిస్క్ తీసుకున్నాడు. తన స్టామినా మీద తనకు నమ్మకం వున్నోడే రిస్క్ తీసుకోగలడు. అబిజీత్ చేసింది అదే.
‘నేనే నామినేట్ అవుతాను.. అంటే, కాదు నేనే నామినేట్ అవుతాను..’ అని అబిజీత్, హారిక మధ్య చర్చ ప్రొలాంగ్ అయ్యింది తప్ప, ‘నువ్వే నామినేట్ అవ్వాలి..’ అని ఎవరూ అనలేదు. అలా చూస్తే, అబిజీత్ స్ట్రాంగ్ మెన్ (Abijeet Saves Alekhya Harika) అయ్యాడు.. అలేఖ్య హారిక స్ట్రాంగ్ విమెన్‌గా ప్రూవ్ చేసుకుంది.