ఇంతకు ముందు సీజన్లలో లేని వింత, నాలుగో సీజన్ బిగ్‌బాస్‌లో కన్పిస్తోంది. అదే ఓ అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు.. ట్రయాంగిల్ ‘స్టోరీ’.! దీన్ని లవ్.. అని అనలేం. కానీ, అలా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. దాంట్లోంచి అబిజీత్ (Abijeet Sorry Secret) మొదట్లోనే బయటకు రావడం చూశాం.
‘రాంగ్ ట్రాక్‌లోకి కథ వెళుతోంది’ అని అబిజీత్ స్వయంగా జాగ్రత్త పడినా, అప్పటికే డ్యామేజీ జరిగిపోయింది. దాన్ని బేస్ చేసుకుని, పదే పదే బిగ్‌హౌస్‌లో అబిజీత్‌ని టార్గెట్ చేస్తూ ‘కార్యకలాపాలు’ నడవడం చూస్తున్నాం.
నామినేషన్స్ ఎపిసోడ్ వచ్చిందంటే చాలు, మోనాల్‌తో అబిజీత్‌కి లింకప్ అవుతోంది.. అఖిల్ మధ్యలోకి వస్తున్నాడు. నానా యాగీ జరిగిపోతూ వచ్చింది. చివరికి అఖిల్‌ని, డైరెక్ట్‌గా ఫినాలెకి పంపేశారు. నిజానికి, డైరెక్ట్‌గా ఫినాలేకి వెళ్ళాల్సిన వ్యక్తి అబిజీత్.
కానీ, అఖిల్‌కి చాలా అవకాశాలిచ్చి, బిగ్‌బాస్ ముందుకు నడిపించడం ద్వారా అబిజీత్, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసినట్లే కనిపిస్తోంది. అయితే, ఇది కేవలం అబిజీత్‌ని అభిమానించేవారి ఆవేదన మాత్రమేనా.? హౌస్‌లో జరుగుతున్న పరిణామాలు వేరేలా వున్నాయా.? అన్నదానిపైనా భిన్న వాదనలు లేకపోలేదు.
మోనాల్ మేటర్‌తో ఎప్పుడు తననుల లింకప్ చేసినా, ఏదో ఒక రాడ్డు పడుతుందని అబిజీత్ ఆందోళన చెందుతూనే వచ్చాడు.. దానికి తగ్గట్టే జరిగింది కూడా. పదే పదే క్షమాపణ చెప్పాల్సి వస్తోంది అబిజీత్‌కి. ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా, వీక్ పాయింట్ మీద పదే పదే కొడితే ఏం చేయగలుగుతాడు.?
ఇప్పటికే ఓ సారి క్షమాపణ చెప్పేశాడు.. కానీ, అయిపోలేదు. తాజాగా ఈ వీకెండ్ ఎపిసోడ్‌లోనూ కన్ఫెషన్ రూమ్‌లోకి వెళతానని పర్మిషన్ తీసుకుని, అక్కడి నుంచి నాగార్జునకి క్షమాపణ చెప్పాడు అబిజీత్.
అలా కొంత భారాన్ని అయితే అబిజీత్ దించుకోగలిగాడుగానీ.. అతనిలో పెయిన్ మాత్రం అలాగే వుండిపోతుంది.. అతను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినా, అది వెంటాడుతూనే వుంటుంది. ఇదంతా చూస్తే, అబిజీత్‌తో బలవంతంగా క్షమాపణ చెప్పిస్తున్నట్లుందిగానీ, అబిజీత్ (Abijeet Sorry Secret) క్షమాపణ చెబుతున్నట్లు అనిపించడంలేదు చాలామందికి.
ఏమో, ఏది నిజమో.. అతన్ని ఆ పరిస్థితుల్లో నెట్టేశాక.. ఇంకో దారి లేక, అబిజీత్ క్షమాపణ చెబుతున్నాడేమో. దాన్ని బిగ్‌బాస్ టీమ్ క్యాష్ చేసుకుంటోందేమో ఎమోషనల్‌గా.