తెగ కష్టపడిపోతున్నట్లు ఓవరాక్షన్ లేదు.. సింపుల్‌గా టాస్క్ ఎంచుకున్నాడు.. పూర్తి చేసేశాడు. అవును, సూటిగా.. సుత్తి లేకుండా.. చాలా సింపుల్‌గా ‘మంకీ బార్’పైన వేలాడే టాస్క్‌ని అబిజీత్ (Abijeet The Bigg Winner) పూర్తి చేసిన వైనం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
‘రోబోస్ – హ్యామన్స్ టాస్క్ తప్ప.. ఇంకేం టాస్క్‌లు ఆడావ్.?’ అని అబిజీత్‌ని పదే పదే హౌస్‌మేట్స్ నిలదీస్తున్న నేపథ్యంలో, ఆ కుంటి సాకు పట్టుకుని ప్రతిసారీ నామినేట్ చేస్తున్న దరిమిలా, అబిజీత్.. పెర్‌ఫెక్ట్‌గా ఇచ్చిపడేశాడు. పది నిమిషాలపాటు అలా మంకీ బార్ మీద వేలాడాడు.
నిజానికి, అంత తేలికైన టాస్క్ కాదిది. కానీ, ఎక్కడా తాను కష్టపడ్డట్టు ‘ఓవర్ యాక్షన్’ అయితే చేయలేదు. ఇక, అవినాష్‌తో ఓ చిన్న విషయమ్మీద స్టార్ట్ అయిన డిస్కషన్‌లో ‘మేటర్’ లేదని గుర్తించి, అబిజీత్ సింపుల్‌గా కట్ చేసిన వైనానికి హేట్సాఫ్ చెబుతున్నారు బిగ్‌బాస్ వ్యూయర్స్.
ఇప్పటిదాకా ఆడియన్స్ రికార్డ్ స్థాయిలో అబిజీత్‌కి ఎందుకు ఓటేస్తున్నారు.? అన్న ప్రశ్నకు సమాధానం ఈ రోజు దొరికేసింది. ఏ విషయంలో అయినా షార్ప్‌గా వ్యవహరిస్తాడు, స్మార్ట్‌గా ఆలోచిస్తాడు.. సూటిగా, సుత్తి లేకుండా ఇచ్చిన పని పూర్తి చేసేస్తాడు.
ఓవర్ ఎమోషన్స్ వుండవు, ఓవర్ యాక్షన్ అసలే అతనిలో కన్పించదు. అందుకే మిగతా కంటెస్టెంట్స్ అందరితో పోల్చి చూసినప్పుడు అబిజీత్ చాలామందికి జెన్యూన్‌గా కనిపిస్తున్నాడు. ‘ఇకపై నన్ను టాస్క్‌ల పేరుతో నామినేట్ చేయడం ఆపెయ్యండి..’ అంటూ అబిజీత్, ‘మంకీ బార్’ టాస్క్ పూర్తి చేశాక తోటి కంటెస్టెంట్స్‌తో స్ట్రెయిట్‌గా చెప్పడం కూడా బిగ్ బాస్ వ్యూయర్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయింది.
ఈ సీజన్ విన్నర్ అవదగ్గ అన్ని అర్హతలూ అబిజీత్‌కి వున్నాయి. ఆ విషయం ఇప్పుడు ఇంకోసారి ప్రూవ్ అయ్యిందంతే. బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్.. ఇంకొద్ది వారాల్లో ముగుస్తుంది. సో, ఇకపై మరిన్ని కరిÄనమైన టాస్క్‌లను కంటెస్టెంట్స్ ఎదుర్కోక తప్పదు. అబిజీత్.. చించెయ్ ఇక ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా.. అంటున్నారు అతని అభిమానులు.