అమ్మ రాజశేఖర్.. ప్రముఖ కొరియోగ్రాఫర్.. అంతేనా, దర్శకుడు కూడా. సూపర్ హిట్ సాంగ్స్‌కి కొరియోగ్రఫీ అందించాడు.. దర్శకుడిగానూ హిట్టు కొట్టాడు. ఏమయ్యిందో అనూహ్యంగా తెరమరుగయ్యాడు. మళ్ళీ అనూహ్యంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా తేలాడు (Abijeet Vs Amma Rajasekhar).
‘అరవ మేళం’ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంలా మారిపోయాడు అమ్మ రాజశేఖర్. గత సీజన్‌లో బాబా భాస్కర్ కూడా ‘అరవ మేళమే’ అయినా, చాలా చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు. అమ్మ రాజశేఖర్ మాత్రం ఆ స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వలేకపోతున్నాడు సరికదా, కన్నింగ్ కంటెస్టెంట్ అనే పేరు తెచ్చుకున్నాడు.
అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడు. కెప్టెన్ అయ్యాక అయితే సాటి కంటెస్టెంట్లకు నరకం చూపించేస్తున్నాడు. ఇక్కడ మేటర్ క్లియర్.. అమ్మ రాజశేఖర్‌కి అందరితోనూ కమ్యూనికేషన్ గ్యాప్ వుంది. అది లాంగ్వేజ్ సమస్య కారణంగా వచ్చిన గ్యాప్ కూడా.
ఈయనేదో అంటాడు.. అవతలి వ్యక్తికి ఇంకోటేదో అర్థమవుతుంది. పోనీ, వాళ్ళకి అర్థమయ్యేలా చెబుతాడా.? అంటే, ఇంకాస్త కాంప్లికేట్ చేసి పారేస్తాడు. కెప్టెన్ అయిన తర్వాత అబిజీత్‌తో గొడవలో అమ్మ రాజశేఖర్ అభాసుపాలయ్యాడన్నది నిర్వివాదాంశం.
హారిక సహా చాలామంది అమ్మ రాజశేఖర్ కెప్టెన్సీని అస్సలేమాత్రం తట్టుకోలేకపోతున్నారు. నిజానికి, హారికని గెలిపించాలని చాలామంది చాలా ప్లాన్లు వేశారు. కానీ, హారిక కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోయింది. అరియానాకి (Ariyana Glory) రెండో సారి ఛాన్స్ వస్తుందని అంతా అనుకున్నారుగానీ.. ఆమె కూడా చేతులెత్తేసింది.
ఇదేదో అమ్మ రాజశేఖర్‌ని (Amma Rajasekhar) కెప్టెన్‌గా చేయడం కోసమే టాస్క్ అన్నట్లు నడిచింది. మెహబూబ్ – సోహెల్ గొడవపడ్డారు. ఎప్పుడూ గొడవపడే అఖిల్ – అబి (Akhil Sarthak – Abijeet) ఈ మధ్య కలిసిపోయారు. లాస్య (Lasya Manjunath) కూడా అమ్మ రాజశేఖర్ మీద సెటైర్లు వేసేసింది. ఓవరాల్‌గా హౌస్‌లో గందరగోళం పీక్స్‌కి వెళ్ళిపోయింది.
ఇంతవరకు ఎవరి కెప్టెన్సీలోనూ ఇన్ని గొడవలు జరగలేదు మొర్రో.. అంటూ హారిక (Alekhya Harika), మాస్టర్ అమ్మ రాజశేఖర్ మీద పెద్ద అబాంఢమే మోపేసింది (Dethadi Harika). ఇదంతా అమ్మ రాజశేఖర్‌కి సింపతీ క్రియేట్ చేస్తుందా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.
నడుస్తున్న తీరు చూస్తోంటే, అమ్మ రాజశేఖర్‌కి (Abijeet Vs Amma Rajasekhar) బిగ్‌బాస్ సీజన్ 4 టైటిల్‌ని (Bigg Boss Telugu 4) కూడా డైరెక్టుగా రాసి ఇచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.