Abinava Krishnadevaraya Pawan Kalyan.. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించిన జన సేన పార్టీ అధినేత, సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద, రాజకీయ విమర్శలు అన్నీ ఇన్నీ కావు.!
‘హిందూ ధర్మం ఏ మతం మీదా వ్యతిరేకతను చాటదు..’ అని చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చారు.
అయితే, హిందూ ధర్మం గురించి ఎవరు మాట్లాడినా నేరమే.. అన్నట్లు సోకాల్డ్ ‘సిక్ మైండెడ్’ పీపుల్, సెక్యులర్ కోణంలో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం సహజమే.
పవన్ కళ్యణ్ ఇంట్లో ఆయన సతీమణి క్రైస్తవాన్ని అనుసరిస్తారు. ఆమె కూడా, ఇటీవల తిరుమలను సందర్శించే క్రమంలో డిక్లరేషన్ ఇచ్చారు, తిరుమలేశుడికి తరనీలాలు కూడా సమర్పించారు.
రాజకీయ విమర్శల్ని పక్కన పెడితే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి అరుదైన గౌరవం దక్కింది. కర్నాటకలో, ఆయనకు ‘అభినవ కృష్ణదేవరాయ’ అనే బిరుదు లభించింది.
పుట్టగ శ్రీకృష్ణ మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ వారి చేతుల మీదుగా పవన్ కళ్యాణ్‌కి ‘అభినవ కృష్ణదేవరాయ’ బిరుదు ప్రదానం జరిగింది.
ఈ సందర్భంగా పండితులు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్‌ని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతినిథిగా అభివర్ణించారు.
శ్రీనివాసుడే శ్రీకృష్ణుడు.. ఆ శ్రీనివాసుడి ప్రతినిథిగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి విచ్చేశారు.. అని పుట్టగ శ్రీకృష్ణ మటాధిపతి చెప్పారు.
సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన పవన్ కళ్యాణ్‌కి దైవ శక్తి అన్ని వేళలా అండగా నిలుస్తుందని ఆశీర్వదించారు పుట్టగ శ్రీకృష్ణ మఠాధిపతి.
హిందూ ధర్మం ఆ సేతు హిమాచలం వర్దిల్లేలా చేయడానికి శతాబ్దాలుగా ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు కృషి చేశారనీ, వారిలో శ్రీకృష్ణదేవరాయులు ఒకరని చెబుతూ, పవన్ కళ్యాణ్‌ని అభినవ కృష్ణ దేవరాయ అనే బిరుదుతో సత్కరించారు.
కాగా, సనాతన ధర్మమంటే మూఢ నమ్మకం కాదనీ, ఆధ్మాత్మిక శాస్త్రమని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భగవద్గీతని మనోధైర్యాన్నిచ్చే గురువుగా అభివర్ణించారు జనసేనాని.
