కరోనా వైరస్ అంటే మరీ కామెడీ అయిపోయింది కొందరికి. ‘ఓ వైపు జనం కరోనాతో చచ్చిపోతోంటే, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు అవసరమా.?’ అని ఓ సెలబ్రిటీని ఓ నెటిజన్ ప్రశ్నిస్తే, ‘మేం వినోదాన్ని పంచుతున్నాం.. తద్వారా కరోనా భయాల (Adah Sharma Glamorous Punch On Corona Virus) నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది..’ అని సెలవిచ్చిందావిడ.
అందాల భామ ఆదా శర్మ అయితే, ఏకంగా గ్లామరస్ పంచ్ ఇచ్చేసింది ‘కరోనా వైరస్’కి. గో కరోనా గో.. 100 ఇయర్స్ ఆఫ్ ఆదా శర్మ, కికింగ్ కరోనా ఎవే.. అంటూ హ్యాష్ ట్యాగ్స్ కూడా జత చేసింది ఆదా శర్మ. బాక్సింగ్ గ్లవ్స్ వేసుకుని, కరోనా వైరస్ మీద పంచ్ విసురుతున్నట్టుంది ఆదా శర్మ. అదీ బీభత్సమైన ‘గ్లామరస్ యాంగిల్’లో.
చూసుకున్నోడికి చూసుకున్నంత.. అన్నట్టుంది ఈ కరోనా గ్లామర్ వ్యవహారం. అందాల భామలు, సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శన చేయడం కొత్తేమీ కాదు. దానికి ఇప్పుడు గ్లామరస్ ట్యాగ్.. ‘కరోనా’ (Adah Sharma Glamorous Punch On Corona Virus) అయ్యిందంతే. నిజానికి, సెల్రబిటీలు చేస్తున్న పనిని తప్పు పట్టలేం.
సోషల్ మీడియా వేదికగా, తమకు తోచినప్పుడు.. కరోనాపై స్పందిస్తున్నారు. బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. ఇవన్నీ చేస్తూ, తమ పని తాము చేసుకుపోతున్నారు. సోషల్ మీడియాలో కాస్తంత టైమ్ పాస్ అవ్వాలనుకుంటే, సెలబ్రిటీల్ని ఫాలో అవ్వొచ్చు.. లేదంటే లైట్ తీసుకోవచ్చు. ఆ ఆప్షన్ ఎటూ వుంది కదా.!