Adipurush Struggle.. కొద్ది గంటల్లోనే ‘ఆదిపురుష్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేయనుంది. రాముడిగా ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటించగా.. ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
దేశమంతా.. ఆ మాటకొస్తే, ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినీ అభిమానులు ‘ఆదిపురుష్’ సినిమా కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ నటించిన సినిమా కావడం దీనికి ఓ కారణమైతే, అంతకు మించిన బలమైన కారణం.. ఇది ‘రామాయణం’ నుంచి తీసుకున్న కథాంశం కావడం మరో కారణం.
Adipurush Struggle.. అసలు సమస్య అదే..
ఇంతకీ, ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) ఎలా కనిపిస్తాడు.? కృతి సనన్ ఎలా కనిపించనుంది.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి.. ఆయా వ్యక్తుల తాలూకు గ్రాఫిక్స్ బొమ్మలతో సినిమాలో చాలా పార్ట్ డిజైన్ చేశారు.

నిజమైన ప్రభాస్, నిజమైన కృతి సనన్ అస్సలు కనిపించరన్న వాదనా లేకపోలేదు. అదే సినిమాకి పెద్ద సమస్యగా మారింది.
దీంతోపాటుగా, కాలి నొప్పితో బాధపడుతున్న ప్రభాస్, ఈ సినిమా విషయంలో డూప్‌నే ఎక్కువగా నమ్ముకున్నాడన్న ఆరోపణలూ లేకపోలేదు.
చాలావరకు గ్రాఫిక్స్ వాడేయడంతో, డూప్‌తోనే కానిచ్చేశారన్నది ఇంకో విమర్శ. అయితే, ఇదంతా కేవలం దుష్ప్రచారమేనని ‘ఆదిపురుష్’ టీమ్ ఇప్పటికే కొట్టిిపారేసింది.
ట్రోలింగ్ మరో సమస్య..
ఈ సినిమాకి మొదటి నుంచీ ట్రోలింగ్ పెద్ద సమస్యగా మారింది. తొలి ప్రోమో బాగోకపోవడంతో మొదలైన ట్రోలింగ్.. ఇంకా కొనసాగుతూనే వుంది.
గ్రాఫిక్స్ విషయంలో ఏమాత్రం అంచనాల్ని అందుకోలేకపోయినా, ఆ తర్వాత వ్యవహారం వేరేలా వుంటుంది. అంతే మరి, హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ ఆశిస్తున్నారు ఇప్పుడు సినీ అభిమానులు.!

ఇప్పటికే నెగెటివిటీ చాపకింద నీరులా గట్టిగానే పాకేసింది. దాన్ని ‘జై శ్రీరామ్.. జై హనుమాన్’ నినాదాలు అధిగమించేస్తాయన్నది ఓ వాదన.!
దానికి తగ్గట్టే సినిమాపై హిందూ సమాజంలో ఓ రకమైన స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ‘ఈ సినిమా చూడకపోతే పాపం చేసినట్లే..’ అన్న భావన కూడా ప్రచారంలో వుందండోయ్.
ఇంతకీ, ‘ఆదిపురుష్’ అంచనాల్ని అందుకుంటుందా.? చూద్దాం.. ఏం జరుగుతుందో.!