Table of Contents
నిఖార్సయిన బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తోన్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా (Ala Vaikunthapurramuloo Review) ఇది. ఆల్రెడీ రెండు హిట్లు కొట్టేసిన ఈ కాంబో, హ్యాట్రిక్ కోసం రెడీ అయిపోవడం, అన్నిటికీ మించి సంక్రాంతి రిలీజ్ కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేశాయి.
పాటలు, సినిమా విడుదలకు ముందే సంచనాలు సృష్టించేయడం.. ఈ సినిమాకి అదనపు అడ్వాంటేజ్‌గా చెప్పుకోవాలి. మరి, ఆ ఆకాశాన్నంటే అంచనాల నడుమ, ఈ సినిమా రిజల్ట్ ఏంటో తెలుసుకోవాలంటే.. రివ్యూలోకి వెళ్ళిపోవాల్సిందే.
బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్
నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్దే, టబు, జయరాం, మురళీ శర్మ, సుశాంత్, నివేదా పేతురాజ్, రాజేంద్రప్రసాద్, సముద్రఖని, సచిన్ ఖేడ్కర్, రోహిణి, నవదీప్, హర్షవర్ధన్, సునీల్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, అజయ్, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి తదితరులు.
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: పి.ఎస్. వినోద్
నిర్మాతలు: సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), అల్లు అరవింద్
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
విడుదల తేదీ: జనవరి 12, 2020
అసలు కథ..
పేదింటి కుర్రాడి స్థానంలోకి, పురిటిబిడ్డగా వున్నప్పుడే ఓ పేదింటి కుర్రాడు వెళ్ళిపోతాడు. పేదింటి కుర్రాడు పెద్దింట్లో.. పెద్దింటి కుర్రాడు పేదింట్లో పేరుగుతారు. ఒకానొక సందర్భంలో పేదింట్లో పెరిగిన పెద్దింటి కుర్రాడికి అసలు విషయం తెలిసిపోతుంది. అలాగని, ఆ విషయాన్ని పెద్దింటి మనుషులకి చెప్పలేడు. ఆ పెద్దింటి పెద్ద మనిషికి కష్టమొస్తే.. ఆ ఇంటి వారసుడిగా పేదింట్లో పెరిగిన కుర్రాడు బాధ్యత తీసుకుంటాడు. చివరికి ఏమవుతుందన్నది తెరపై చూడాల్సిందే.
నటీనటులు ఎలా చేశారంటే..
స్టయిలిష్ పాత్రలకి అల్లు అర్జున్ పెట్టింది పేరు. మాస్ క్యారెక్టర్స్‌ని ఎలా ఇరగదీసెయ్యాలో కూడా బన్నీకి బాగా తెలుసు. స్టయిలిష్ అండ్ మాస్ టచ్‌తో కంప్లీట్ ఎనర్జీతో అల్లు అర్జున్ చితక్కొట్టేశాడంతే. అభిమానులు తన నుంచి ఏం ఆశిస్తారో అవన్నీ ఇచ్చేశాడు. డాన్సులు, ఫైట్స్.. ఇలా అన్నీ స్టైలిష్ అండ్ ఎనర్జిటిక్‌గా వున్నాయి.
హీరోయిన్ పూజా హెగ్దే ‘మేడమ్ సర్.. మేడమ్ అంతే..’ అన్నట్లుగానే బాగా చేసింది. బుట్టబొమ్మలా తన పాత్రలో ఒదిగిపోయింది. అయితే, ఆమెను ఇంకాస్త అందంగా చూపించే అవకాశం వున్నా, ఆ దిశగా దర్శకుడు సరైన ఫోకస్ పెట్టలేదేమో అన్పిస్తుంది. సుశాంత్, నివేదా పేతురాజ్ జస్ట్ అతిది¸ పాత్రలు అన్నట్లు తెరపై కనిపించారంతే.
జయరాం తన పాత్రలో ఒదిగిపోయాడు. టబు కూడా ఓకే. ఆమెను ఇంకాస్త బాగా వాడుకుని వుండాల్సింది. సచిన్ ఖేడ్కర్ తన అనుభవాన్ని రంగరించాడు. సముద్రఖని, తెలుగు తెరపై కొత్త విలనిజం ప్రదర్శించాడుగానీ.. అతని పాత్రను ఇంకొంచెం పవర్‌ఫుల్‌గా చిత్రీకరించి వుండాల్సింది.
వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులంతా అవసరమైన చోట నవ్వులు బాగానే పూయించారు. సునీల్ చాలా జోష్‌తో కనిపించాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. మురళీ శర్మ నటన చాలా బావుంది. నిజానికి హీరోతో పోటీ పడ్డాడు చాలా సన్నివేశాల్లో తనదైన నటన, బాడీ లాంగ్వేజ్‌తో.
సాంకేతిక వర్గం పని తీరు..
త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. కథనం వేగంగా సాగింది. సినిమాలో ప్రతి ఫ్రేవ్‌ు చాలా రిచ్‌గా కన్పించిందంటే సినిమాటోగ్రఫీ ఎంత బావుందో అర్థం చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా పూర్తయ్యాక కూడా మంచి ఫీల్‌ని ఇస్తుంది.
పాటలు, సినిమా విడుదలకు ముందే మంచి హిట్ అయ్యాయి. తెరపై చూడ్డానికి ఇంకా అందంగా వున్నాయి. నిర్మాణపు విలువల విషయానికొస్తే, ఖర్చు పరంగా ఎక్కడా రాజీ పడని వైనం కనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా బావుంది. టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్‌ని దర్శకుడు బాగా వాడుకున్నాడు.
విశ్లేషణ
చాలా సినిమాల్లో చూసేసిన పాయింటే ఇది. అయితే, ఈ జనరేషన్‌కి తగ్గట్టుగా త్రివిక్రవ్‌ు తనదైన స్టయిల్లో కథ చెప్పాడంతే. పాత్రలు, వాటి తీరు.. ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి. మురళీ శర్మ బాడీ లాంగ్వేజ్, అల్లు అర్జున్ పేదింట్లో పడే సరదా ఇబ్బందులు ఈ క్రమంలో ఫ్రస్ట్రేషన్.. ఇలాంటివన్నీ ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేస్తాయి.
పూజా హెగ్దే గ్లామర్, నివేదా పేతురాజ్ హాట్ అప్పీల్, సుశాంత్ అతిది¸ పాత్ర.. ఇవన్నీ సినిమాకి ఇంకాస్త జోష్ ఇచ్చాయి. యాక్షన్ ఎపిసోడ్స్‌ని చాలా బాగా డిజైన్ చేశారు. రొటీన్‌కి భిన్నంగా వున్నాయి యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ. ఆ యాక్షన్ ఎపిసోడ్స్‌కి రిపీట్ ఆడియన్స్ వుండే అవకాశముంది.
నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆడియన్స్‌కి ముందే తెలిసిపోతుందిగానీ.. కథ ఎంటర్టైనింగ్ మోడ్‌లో నడిచిపోతుండడం పెద్ద ప్లస్ పాయింట్. ఓవరాల్‌గా ఈ సంక్రాంతికి పెర్ఫెక్ట్ పైసా వసూల్ కాగల అన్ని అర్హతలూ ఈ సినిమాకి వున్నాయి.
ఫైనల్ టచ్: అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo Review).. రికార్డుల వేటలో.!