తెలంగాణ పర్యాటక విభాగం బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం అలేఖ్య హారిక (Alekhya Harika Telangana State Tourism Brand Ambassador) పేరుని ఖరారు చేసింది. మహిళా దినోత్సవం నాడు ఆమెకు ఈ గౌరవం దక్కింది. కానీ, అదృష్టం తలుపు తట్టేలోపు, దురదృష్టం చాచి కొట్టిందన్నట్టు డేత్తడి హారిక నియామకం వివాదాస్పదమయ్యింది.
‘తూచ్, ఆమె నియామకం తప్పు..’ అంటూ, తెలంగాణ టూరిజం శాఖ వర్గాల నుంచి ఇంకో వార్త వెలుగు చూసింది. ఏమయ్యిందోగానీ, ‘హారిక (Dethadi Harika) తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతారు. అయితే, ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వకుండా.. తక్కువ మొత్తంలో ఆమె పనికి తగ్గట్టుగానే చెల్లింపులు వుంటాయి..’ అని వివరణ వచ్చింది టూరిజం శాఖ నుంచి.
ఈ మొత్తం వ్యవహారంలో, హారిక (Harika Dethadi) కాస్సేపు ఉత్సాహపడింది, అంతలోనే నిరాశపడింది.. మళ్ళీ తేరుకుని ఉత్సాహపడింది. చివరకు అవమానభారంతో కుంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ‘హారిక ఎవరో తెలియదు..’ అని అన్నారట.
దాంతో, హారిక అభిమానులు సోషల్ మీడియా వేదికగా గుస్సా అవుతున్నారు. హారిక తెలియకపోవడమేంటి.? ప్రముఖ యూ ట్యూబర్ ఆమె. సోషల్ మీడియాలో బోల్డంత ఫాలోయింగ్ వుంది అలేఖ్య హారిక అలియాస్ డేత్తడి హారికకి. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఆమె రేంజ్ ఇంకా పెరిగిపోయింది.
సరే, అలేఖ్య హారిక (Alekhya Harika Telangana State Tourism Brand Ambassador) కంటే పెద్ద సెలబ్రిటీలను తీసుకొస్తే, తెలంగాణ టూరిజం విభాగానికి మరింత హైప్ వస్తుంది.. తెలంగాణలోని పర్యాటక కేంద్రాలకు తమ గ్లామర్‌ని ఆ పెద్ద సెలబ్రిటీలు అద్దగలరు. అలాగని హారికని కావొచ్చు, ఇంకొకర్ని కావొచ్చు.. ఇలా పిలిచి మరీ అవమానించడం తగని విషయం.
మరోపక్క, పెద్దగా పాపులారిటీ లేని హారికను ఎలా ఎంపిక చేస్తారంటూ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ టూరిజం విభాగాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.