Allu Arjun Remuneration.. ఎంత పెద్ద హిట్టొస్తే మాత్రం.. రెమ్యనరేషన్ పెంచేస్తావా.? ఏం పద్ధతయ్యా ఇది.! ఔను, అందరూ దీన్ని ఖండించాల్సిందే. ఇదొక ఘోర తప్పిదం, దుర్మార్గం.. అంతేనా, కొత్త పదాలు వెతికి మరీ విమర్శించెయ్యాల్సిందే.!
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ.. అంటూ ‘పుష్ప ది రైజ్’ సినిమాతో యావత్ భారతీయ సినీ పరిశ్రమని ఓ ఊపు ఊపేశాడు ఐకాన్ స్టార్‌గా మారిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కరోనా పాండమిక్ సమయంలో ఈ స్థాయి విజయం అంటే ఆషామాషీ వ్యవహారమేమీ కాదు.
దుమ్ము దులిపేసిన అల్లు అర్జున్.!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని భాషల్లోనూ ‘పుష్ప’ సినిమా వసూళ్ళ దుమ్ము దులిపేసింది. తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ స్టామినా గురించి కొత్తగా చెప్పేదేముంది.? మలయాళ సినీ పరిశ్రమలోనూ మల్లు అర్జున్‌గా తనదైన స్టామినా ఎప్పుడో నిరూపించేసుకున్నాడు. ఈసారి బాలీవుడ్‌లోనూ వసూళ్ళ పరంగా ట్రెండ్ సృష్టించేశాడు అల్లు అర్జున్.

ఇంకేముంది, ఇంత పెద్ద విజయం వచ్చాక, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ పెంచేయకుండా వుంటాడా.? పెంచేశాడట.. అందుకే.! ఎంత పెంచాడట.? ఏమో, అదైతే ఎవరికీ తెలియదు ప్రస్తుతానికి. ఖచ్చితంగా హిట్టొచ్చిన హీరోకి రెమ్యునరేషన్ పెరుగుతుంది. హీరోలకే కాదు, హీరోయిన్లకీ, దర్శకులకీ, టెక్నీషియన్లకీ.. కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు.. ఇలా అందరికీ సక్సెస్‌తోపాటే రెమ్యునరేషన్ పెరగడం అనేది కొత్త విషయం కాదు.
Allu Arjun Remuneration.. డిమాండ్‌కి అనుగుణంగానే..
ఫలానా హీరోతో ఫలానా రేంజ్ సినిమా చేస్తే, ఫలానా స్థాయిలో లాభాలొస్తాయనే అంచనాలతోనే నిర్మాతలు సినిమాలు నిర్మిస్తుంటారు. తాము పెట్టిన ఖర్చుకి లాభాలు వచ్చేదెలా.? అన్న ఆలోచన చేయడమే కాదు, సినిమా ఎక్కువమందికి రీచ్ కావాలన్నా.. లాభాలు రావాలన్నా అవసరమైన మేర ఖర్చు చేయడానికి నిర్మాతలు వెనుకాడరు.
ఫ్లాపుల్లో వున్నప్పుడు ఎవరైనా రెమ్యునరేషన్ పెంచగలరా.? పెంచితే, నిర్మాతలు ఒప్పుకుంటారా.? డిమాండ్‌కి అనుగుణంగానే రేటు పెరుగుతుంది. అల్లు అర్జున్ విషయంలో అయినా, ఇంకెవరి విషయంలో అయినా అంతే. ‘మేం అడిగినంత పెంచేయరు నిర్మాతలెవరైనా.. మాకు ఎంత ఇస్తే వర్కవుట్ అవుతుందో నిర్మాతలే ఓ అంచనాకి వస్తారు..’ అని చాలామంది సెలబ్రిటీలు చాలాసార్లు చెప్పినాసరే, ఈ ‘పెంపు’ ప్రచారాలైతే జరుగుతూనే వుంటాయ్.
Also Read: గోతికాడి నక్కలకి గూబ గుయ్యమంది ‘బాస్’.!
అక్కడికేదో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ పెంచేసి, పెద్ద పాపమే చేసేశాడనేంతలా ప్రచారం జరుగుతోంటే, నవ్వాలో ఏడవాలో తెలియడంలేదు చాలామందికి. అసలే, హీరోల రెమ్యునరేషన్ల మీద రాజకీయ నాయకులు పడి ఏడవడం ఎక్కువైపోయింది ఈ మధ్యన. ఇలాంటి ప్రచారాలు సినీ పరిశ్రమను దెబ్బతీస్తాయండోయ్.!