KTR Kavitha TRS.. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
అంతకు ముందు తెలంగాణలో, వైఎస్ షర్మిల ఓ రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.
అయితే, అన్న జగన్తో విభేదించిన షర్మిల, ఆంధ్ర ప్రదేశ్లో కాకుండా తెలంగాణలో పార్టీ పెట్టారు. కవిత మాత్రం, తెలంగాణలోనే రాజకీయాలు చేస్తున్నారు కొత్త రాజకీయ పార్టీ ద్వారా.
కవిత కూడా, అన్న కేటీయార్తో విభేదించి, గులాబీ పార్టీ (బీఆర్ఎస్.. అంతకు ముందు టీఆర్ఎస్) నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
షర్మిలకి ఏనాడూ వైసీపీలో సభ్యత్వం లేదట. ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పదవి ఆశించి భంగపడ్డారు షర్మిల. ఇప్పుడు ఆస్తుల పంచాయితీ కూడా నడుస్తోంది.
KTR Kavitha TRS.. కవిత వ్యూహాత్మక రాజకీయం..
ఇక, కవిత వ్యవహారం వేరు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ జాగృతి ద్వారా. ఆమెకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీ వుంది రాజకీయాల్లో.
ఎంపీగా పని చేశారు, ఎమ్మెల్సీగా పని చేశారు.. లిక్కర్ స్కామ్లో కవిత జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. జగన్ జైలుకు వెళితే, వైసీపీ బాధ్యతల్ని భుజాన వేసుకుని, సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఘనత షర్మిలది.

ఇప్పుడీ పోలికలు ఎందుకంటే, అసలు తెలంగాణలో కవిత పార్టీ నిలబడుతుందా.? లేదా.? అన్న కోణంలోనే. తెలివిగా, తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు పెట్టుకున్నారు కవిత తన కొత్త పార్టీకి.
టీఆర్ఎస్ అంటే, ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ ప్రజానీకం తమ సొంత పార్టీగా భావించారు అప్పట్లో దీన్ని. ఎప్పుడైతే, బీఆర్ఎస్ అయ్యిందో, తెలంగాణ ప్రజలు లైట్ తీసుకున్నారు.
బీఆర్ఎస్ భవిష్యత్తేమిటో.?
సరే, రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుంది.. అన్నది వేరే చర్చ. కానీ, కవిత గనుక సీరియస్ రాజకీయాలే చేస్తుంటే, తెలంగాణలో బీఆర్ఎస్ గల్లంతయిపోవడం ఖాయం.
అదే జరిగితే, కేటీయార్ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది.? నిజానికి, కేటీయార్ అంత తెలివైన వ్యక్తే అయితే, సోదరితో విభేదాల్ని పరిష్కరించుకునేవారే.
Also Read: ‘అమెరికా దెబ్బ’కి విలవిల్లాడుతున్న ప్రపంచం.!
హరీష్ రావుతో ఆధిపత్య పోరు వల్లనే బీఆర్ఎస్కి దూరమయ్యారు కవిత. కానీ, అది కాస్తా అన్నా చెల్లెల్ల పంచాయితీగా మారి, మధ్యలో కేటీయార్ ఇరుక్కుపోయారు.
షర్మిల దూరమయ్యాక, వైసీపీ పరిస్థితి ఏమయ్యిందో అందరికీ తెలుసు. కవిత దూరమయ్యాక, బీఆర్ఎస్ పరిస్తితి ఏంటన్నది ముందు ముందు తెలుస్తుంది.
