TVK Vijay Tamilnadu Results.. ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్.. ఈ రెండిటి మధ్యా విడదీయరాని సంబంధం వుంది.
గత కొన్నేళ్ళుగా ఎన్నికలకు ముందర, ఎన్నికల తర్వాత.. రాజకీయ పార్టీల గురించి, ‘పోల్స్’ నిర్వహించేవారు ఎక్కువైపోయారు.
నిత్యం ఎక్కడో ఓ చోట ఏదో ఒక పోల్ జరుగుతూనే వుంది. ఫలానా పార్టీ గురించి మీ అభిప్రాయమేంటి.? అనే పోల్స్ నిర్వహిస్తూనే వున్నారు.
మీడియాలో ఆ పోల్స్ ఫలితాల గురించిన చర్చ మళ్ళీ మామూలే. ప్రధానంగా మీడియా సంస్థలే ఈ తరహా పోల్స్‌ని ఎక్కువగా నిర్వహిస్తుంటాయి.
TVK Vijay Tamilnadu Results.. కోట్లు ఖర్చయిపోతున్నాయ్..
ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కూడా ఇటీవలి కాలంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి పోల్స్ నిర్వహణలో. లక్షల్లో కాదు, కోట్లు ఖర్చు చేసి మరీ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోల్స్ నిర్వహిస్తుండడం గమనార్హం.
ఇంతకీ, తమిళనాడు అసెంబ్లీకి సంబంధించి వెలవడుతున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని ఎలా చూడాలి.? అంటే, ఇవి జస్ట్ అంచనాలు మాత్రమే.
పోలింగ్ ముగిశాక, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కుప్పలు తెప్పలుగా బయటకు వస్తుంటాయి. అలా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం చూస్తే, తమిళనాట టీవీకే విజయ్ ప్రభావం కొంత మేర బాగానే వుండొచ్చని తెలుస్తోంది.
ఓ అంచనా ప్రకారం, విజయ్ అధికారంలోకి వచ్చేస్తాడట. చాలా ఎగ్జిట్ పోల్ అంచనాలు, విజయ్ పది – పదిహేను సీట్లకు పరిమితమవుతాడని అంటున్నాయి.
ఎవరి గోల వారిదే..
కొన్ని పోల్స్ అయితే, విజయ్ ప్రభావమే ఏమీ వుండదు తమిళనాడు ఎన్నికల్లో.. అని తేల్చేశాయి. ముందే చెప్పుకున్నట్లు, ఎవరి గోల వారిదే.
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అన్ని ఎగ్జిట్ పోల్స్, వైసీపీకే అనుకూలంగా వచ్చాయి 2024 ఎన్నికలకు ముందర. ఎన్నికలయ్యాక, ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీకే అనుకూలంగా వున్నాయి.
Also Read: నాలుగు పదుల వయసులో.. కుర్చీ మడతబెడితేనే ఫిట్టు.. పెర్‌ఫెక్టు.!
కొన్ని ఎగ్జిట్ పోల్ అంచనాలు మాత్రమే, కూటమి వైపు మొగ్గు చూపాయి. మరీ ముఖ్యంగా జనసేన ప్రభావాన్ని అన్ని ఎగ్జిట్ పోల్ అంచనాలూ లైట్ తీసుకున్నాయి. కట్ చేస్తే, జన సేన బంపర్ విక్టరీ అందుకుంది.
సో, ఎగ్జిట్ పోల్ అంచనాల్ని నిజమని నమ్మేయడానికి లేదు. ఓటరు ఆల్రెడీ తీర్పునిచ్చేశాడు. అదేంటో, ఫలితాల వెల్లడి రోజున తెలుస్తుంది. ఈలోగా ఏ విశ్లేషణ అయినా సొల్లు పురాణమే అవుతుంది.
