Amala Paul Positivity Magnet.. గ్లామర్ ప్రపంచంలో నేనూ ఓ అందాల బొమ్మనే.! కాకపోతే, అంతకన్నా ముందు నేను కూడా ఓ మామూలు అమ్మాయినే.! ఇదీ తరచూ అందాల భామ అమలా పాల్ చెప్పే మాట.!
నిజమే, అమలా పాల్ చెప్పేది కూడా నిజమే. అందరు అమ్మాయిల్లానే అమలా పాల్ కూడా ప్రేమించి, పెళ్ళి చేసుకుంది. కానీ, ఆ వైవాహిక జీవితం ఎక్కువ రోజులు కొనసాగలేదు.
చాలా చాలా తక్కువ సమయంలోనే విడాకులు తీసుకోవాల్సి రావడాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయమే పట్టింది.
అందమైన అయస్కాంతం.!
సినిమాలే నన్ను మార్చాయ్.! సినిమాని మొదట్లో కేవలం కెరీర్‌గానే భావించినా, ఆ తర్వాత అదే తనకు జీవితమైపోయిందని చెబుతుంటుంది అమలా పాల్.!
యోగా, ధ్యానం.. ఇవన్నీ తనలో పాజిటివిటీని పెంచాయనీ, తాను ఓ పాజిటివిటీ అయస్కాంతంగా మారిపోయాననీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమలా పాల్ చెప్పుకొచ్చింది.

నటిగానే కాదు, నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. ‘ఆమె’ సినిమాతో దేశవ్యాప్తంగా నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అమలా పాల్ (Amala Paul).
Amala Paul Positivity Magnet .. సక్సెస్ సీక్రెట్ పాజిటివిటీనే.!
వాట్ నెక్స్‌ట్.? అని ప్రశ్నిస్తే, ‘ఏమో, చెప్పలేను..’ అని సమాధానం చెప్పిన ఈ బ్యూటీ, మళ్ళీ పెళ్ళెప్పుడు.? అనడిగితే, ఆ ఆలోచన ప్రస్తుతానికైతే లేదని తేల్చి చెప్పింది.
అమ్మాయిలు సున్నితంగా వుంటారనీ, అదే సమయంలో స్ట్రాంగ్‌గా వుండగలరనీ అంటోన్న అమలా పాల్, అందుకు తానే నిదర్శనమని చెబుతూ, ప్రతి అమ్మాయీ జీవితంలో తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు ప్రయత్నించాలని సూచిస్తోంది.
సినిమాల్లో ఏ జోనర్ అమలా పాల్‌కి బాగా నచ్చుతుందో తెలుసా.? థ్రిల్లర్ జోనర్ అట. యాక్షన్ గర్ల్ అనిపించుకోవడంలో ఆ కిక్కే వేరప్పా అని చెబుతుంటుంది ఈ బ్యూటీ.
Also Read: పొట్టి డ్రస్సు.. అనసూయ కస్సు బుస్సు
ఒకప్పుడు హీరోయిన్లకు కెరీర్ స్పాన్ చిన్నదిగా వుండేదనీ, ఐదారేళ్ళలో కెరీర్ ముగిసిపోయేదనీ, ఇప్పుడైతే పదేళ్ళకు పైనే హీరోయిన్లు సినీ రంగంలో రాణిస్తున్నారనీ అమలా పాల్ అభిప్రాయపడింది.
తెలుగులో ‘నాయక్’, ‘బెజవాడ’ తదితర చిత్రాల్లో అమలా పాల్ నటించిన సంగతి తెలిసిందే. ఓ వెబ్ సిరీస్ కూడా తెలుగులో చేసిందీ డస్కీ బ్యూటీ.!