Amala Paul Said Yes.. ఔను.! అమలా పాల్ మళ్ళీ పెళ్ళి పీటలెక్కబోతోంది.! అయితే, పెళ్ళెప్పుడన్నదానిపై ఇంకాస్త స్పష్టత రావాల్సి వుంది.
అయినా, మళ్ళీ పెళ్ళి పీటలెక్కడమేంటి.? అంటే, గతంలోనే ఆమెకు ఓ సారి పెళ్ళయ్యింది. ప్రేమించి, పెళ్ళి చేసుకుంది. కానీ, ఆ వైవాహిక బంధం ఎక్కువ రోజులు నిలబడలేదు.
దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్ళాడింది అమలా పాల్. అతనితోనూ, అతని కుటుంబంతోనూ వచ్చిన అభిప్రాయ బేధాల కారణంగా ఆ వైవాహిక బంధం తక్కువ సమయంలోనే ముగిసిపోయింది.
Amala Paul Said Yes.. ప్రేమ పెళ్ళి.. మళ్ళీ మళ్ళీ.!
గత కొంతకాలంగా అమలా పాల్, జగత్ దేశాయ్ అనే వ్యక్తితో ప్రేమలో వుంది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ బోల్డన్ని గాసిప్స్ షికారు చేశాయి కూడా.
కొన్నాళ్ళ క్రితమే ఈ ఇద్దరికీ పెళ్ళయిపోయిందంటూ గాసిప్స్ కూడా వినిపించాయి. కానీ, అదంతా ఉత్తదేనని తేల్చేసింది అమలా పాల్ పలు సందర్భాల్లో.

తాజాగా, జగత్ దేశాయ్‌కి అమలా పాల్ ఓకే చెప్పేసింది.! ఇందులో కొత్తగా ‘ఓకే’ చెప్పడానికేముంది.? అంటే, త్వరలో పెళ్ళి పీటలెక్కబోతున్నట్టేనా.? అంతేనేమో.!
ఇంతకీ, పెళ్ళెప్పుడు.? ఈ ప్రశ్నకైతే ఇంకా సమాధానం తెలియాల్సి వుంది. తొలి పెళ్ళి పెటాకులైతే మాత్రం, రెండు పెళ్ళి చేసుకోకూడదన్న రూలేం లేదు.
Also Read: తప్పు తెలుసుకున్నా.! మళ్లీ ‘ఆ’ తప్పు చేయను!
ఈ రోజుల్లో అభిప్రాయ బేధాలన్నది చాలా చిన్నమాట.! చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారు. సో, రెండో పెళ్ళి.. కుదిరితే, మూడు.. నాలుగో పెళ్ళి కూడా తప్పేం కాదు.
టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా పలు సినీ పరిశ్రమల్లో చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది అమలా పాల్. అంతేనా, వెబ్ సిరీస్‌లలోనూ నటించిందండోయ్.!
