Ambati Rayudu Political Sixer.. క్రికెటర్లు రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు.? అజారుద్దీన్, గౌతమ్ గంభీర్.. చెప్పుుకుంటూ పోతే లిస్టు పెద్దదే.!
ఇంతకీ, అంబటి తిరుపతి రాయుడు సంగతేంటి.? రాజకీయాల్లోకి వస్తున్నాడా.? లేదా.? అంతర్జాతీయ క్రికెట్‌కి ఇటీవల అంబటి రాయుడు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే.
అంతకన్నా ముందే, అంబటి రాయుడు.. సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ కామెంట్స్ చేశాడు. అదీ, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ మీద. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద.!
Ambati Rayudu Political Sixer.. వైసీపీ నుంచే రాజకీయాల్లోకి.?
అంబటి తిరుపతి రాయుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) గుంటూరు ఎంపీ టిక్కెట్టు ఇస్తామని అంటోందట.
వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి, మంత్రి అంబటి రాంబాబు ఈ మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై అంబటి రాయుడు స్పందించాల్సి వుంది.

మరోపక్క, తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) కూడా అంబటి రాయుడుతో (Ambati Thirupathi Rayudu) టచ్‌లోకి వెళ్ళిందట.
జనసేన పార్టీతోనూ (Jana Sena Party) అంబటి రాయుడు (Ambati Rayudu) టచ్‌లో వున్నారనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో..
తెలంగాణ (Telangana) రాజకీయాల విషయానికొస్తే, మంత్రి హరీష్ రావుతో (Harish Rao) అంబటి రాయుడికి (Ambati Thirupathi Rayudu) అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయట. అజారుద్దీన్ సంగతి సరే సరి.
మల్కాజిగిరి ఎంపీ సీటుని అంబటి రాయుడికి (Ambati Rayudu) ఇవ్వాలని భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) భావిస్తోందన్నది తాజా ఖబర్.
Also Read: పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ రగడ.! ‘కోట’ని ఉసిగొల్పిందెవరు.?
ఏంటి.? ఇదంతా నిజమే.! రాజకీయాల్లో నిజానిజాల సంగతి పక్కన పెడితే, స్పెక్యులేషన్స్ ఎక్కువ వుంటాయి. ఈ స్పెక్యులేషన్స్‌కి అనుగుణంగా రాజకీయ సమీకరణాలూ మారతాయ్.
ఏమో.! అంబటి రాయుడు మనసులో ఏముందో.! ఏ రాజకీయ ఉద్దేశ్యాలూ లేకుండానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆయన ట్వీటేసి వుంటాడని ఎలా అనుకోగలం.?