Ammayilooo Abbayiloo.. అది కర్నాటక రాష్ట్రం మంగుళూరు. ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, ఓ ప్రైవేటు భవనంలో ప్రైవేటుగా పార్టీ చేసుకున్నారట.!
ఇందులో తప్పేముంది.? అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి పార్టీ చేసుకుంటే తప్పేంటట.? తప్పేమీ లేదు. కాకపోతే, ‘ట్రూత్ ఆర్ డేర్’ అనే ఓ గేమ్ ఆడారు.
అదేనండీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘ఆరెంజ్’ సినిమాలో చూపించారు కదా.! అదే ఈ ట్రూత్ ఆర్ డేర్.! నిజం చెప్పాలి, లేదంటే సాహసం చెయ్యాలన్నమాట.
సరే, గేమ్ ఆడటంలో తప్పేమీ లేదు. కాకపోతే, ఈ ఆటలో భాగంగా ఓ అబ్బాయి, ఓ అమ్మాయికి ముద్దు పెట్టేశాడు.. అది కూడా మూతి ముద్దు.!
Ammayilooo Abbayiloo.. ఆట నేరమైతే ఎలా.?
పెద్ద నేరమే ఇది.. అని మీకనిపిస్తే, అది మీ తప్పు కానే కాదు. కానీ, నిజానికి ఈ రోజుల్లో దాన్ని తప్పుగా భావించడమే పెద్ద తప్పు. ట్రెండ్ మారింది. యువత అప్‌డేట్ అయ్యింది.!
విషయం సోషల్ మీడియాకెక్కింది. ‘లిప్ లాక్ ఛాలెంజ్’ షురూ అయ్యింది. అబ్బో, వ్యవహారం ముదిరి పాకాన పడినట్టుందే.!
అందుకే, పోలీసులు రంగంలోకి దిగారు. పలువుర్ని అరెస్టు కూడా చేశారట. సరే, అరెస్టు చేశారు. ఆ తర్వాత ఏమవుతుంది.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.
సినిమాల్లో లిప్ లాక్ సీన్స్‌కి వుండే కిక్కే వేరప్పా. వెబ్ సిరీస్‌ల పుణ్యమా అని అవి మరింత కామన్ అయిపోయాయ్. అవి చూసి యువత చెడిపోతోంది కూడా.!

అబ్బే, తాము తీసే సినిమాలు, వెబ్ సిరీస్‌ల వల్ల కాదు యువత చెడిపోయేది.? యువత చెడిపోయిన వైనాన్నే మేం చూపిస్తున్నాం.. అని సినీ జనాలు అంటుంటారు.
ఎవరి గోల వారిదే.! సహజీవనం తప్పు కాదు. అలాంటప్పుడు, యువతీ యువకులు ప్రేమోతోనో.. కాస్త కిక్కు కోసమో జస్ట్ ఓ లిప్ లాక్ లాగించేస్తే అది పెద్ద నేరమెలా అవుతుంది.?
తప్పే కాదంటారా.? అయితే, అలా అనడం మీ తప్పు కాదేమో.!
ఇలా తయారైంది ఆర్గ్యుమెంట్ల పరిస్థితి. ఇందులోనూ జినం లేకపోలేదు.! ఇంటర్నెట్‌ని జనాల్లోకి విచ్చలవిడిగా వదిలేశాక, అందులోని కంటెంట్ మీద సరైన సెన్సార్ లేక.. పరిస్థితులిలా దిగజారుతున్నాయ్.
రోజుకో కొత్త ఛాలెంజ్ సోషల్ మీడియా వేదికగా దర్శనమిస్తోంది. ఐస్ బకెట్ ఛాలెంజ్ దగ్గర్నుంచి, ప్రాణాలు తోడేసే ఛాలెంజ్‌లు ఎన్నో చూస్తున్నాం.
ప్రతిసారీ యువత ఇలాంటివాటికి తేలిగ్గా ఎట్రాక్ట్ అవుతుంటారు. ఆ ట్రాప్‌లో పడిపోతుంటారు. తల్లిదండ్రులకు పిల్లల మీద బాధ్యత వుండట్లేదు. పిల్లలకు తమ జీవితాలపై బాధ్యత వుండట్లేదు.
Also Read: టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే సినిమా థియేటర్లకు జనం వచ్చేస్తారా.?
తప్పెవరిది.? అంటే, కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ప్రపంచ గమనం ఎలా సాగుతోంటే, అందులో మనం కూడా కొట్టుకుపోవాల్సిందే. ఔను, ఇదొక ప్రవాహం.!
మంచిదా.? చెడ్డదా.? అన్న ఆలోచన వల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. అలా ఆలోచించడమే పెద్ద నేరమైపోయిందిప్పుడు.
వున్నంతలో జాగ్రత్త పడటం.. అన్నదానికి కూడా అవకాశం లేకపోతోంది. ఆయా ఛాలెంజ్‌ల విషయంలో ముందడుగు వేయకపోతే, నవ్వులపాలైపోవాలి.. అలాక్కూడ మానసిక ఒత్తిడే.!
ప్చ్.. ఏం చేయలేం.! ఇదింతే. ఈ పైత్యమింతే. దీనికి విరుగుడు లేదు.
