Table of Contents
Ananya Nagalla Pottel Commitment.. అనన్య నాగళ్ళ పదహారణాల తెలుగమ్మాయ్.! తన టాలెంట్‌తో సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకుంటోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాతో నటిగా పాపులర్ అయ్యింది. చిన్నా చితకా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవిస్తే, తనకు తోచిన రీతిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విడివిడిగా విరాళాన్ని కూడా అందించింది.
Ananya Nagalla Pottel Commitment.. పొట్టేల్ సినిమాతో..
‘పొట్టేల్’ పేరుతో విడుదలకు సిద్ధమైన ఓ సినిమాలో నటించిన అనన్యకి, ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో ఓ లేడీ ఎర్నలిస్టు కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది.
సినిమా విశేషాల గురించి ప్రశ్నించాల్సిందిపోయి, ఆ సినీ ఎర్నలిస్టు ‘కమిట్మెంట్’ గురించి ప్రస్తావించింది. సినీ పరిశ్రమలో కమిట్మెంట్ మామూలే కదా.. మీరూ ఇచ్చారా.? అన్నది ఆ ఎర్నలిస్టు ప్రశ్న.
‘మీకెవరు చెప్పారు.? అదేం వుండదు సినీ పరిశ్రమలో’ అని అనన్య గట్టిగానే బదులిచ్చింది. బదులివ్వడం కాదు, పెంటలో ముంచిన చెప్పుతో ఆ సినీ ఎర్నలిస్టు చెంప పగిలేంతలా మాటతోనే చెప్పు దెబ్బ కొట్టింది.
రెండు చెంపలూ పగిలిపోయేలా..
అయినా సిగ్గు రాలేదు ఆ ఎర్నలిస్టుకి. ‘రెమ్యునరేషన్ కూడా కమిట్మెంట్ని బట్టే ఎక్కువ, తక్కువ అనేది ఆధారపడి వుంటుందట కదా’ అని మరో జుగుప్సాకరమైన ప్రశ్న వేసింది.
ఈసారి కూడా పెంటలో ముంచిన చెప్పుతో కొట్టినట్లే, రెండు చెంపలూ వాచిపోయేలా సమాధానమిచ్చింది అనన్య నాగళ్ళ.
సినీ నటి కాబట్టి, అనన్య నాగళ్ల అంటే ఆ సినీ ఎర్నలిస్టుకి అంత చులకనగా కనిపిస్తోందేమో.! మరి, జర్నలిజం అనే వృత్తిలోకి రావడానికి ఆ ఎర్నలిస్టు ఏం కమిట్మెంట్ ఇచ్చినట్లు.?
కిలేడీ ఎర్నలిస్టు ఏం కమిట్మెంట్ ఇచ్చిందో.!?
సదరు మీడియా సంస్థలో ఉద్యోగం కోసం ఆ మహిళా ఎర్నలిస్టు, ఆ సంస్థ యాజమాన్యానికి, లేదా పై స్థాయి సిబ్బందికి ఏం కమిట్మెంట్ ఇచ్చినట్లు.?
కమిట్మెంట్లు ఇవ్వడంలో దిట్ట అయితేనే, కమిట్మెంట్ గురించి ఆ కి‘లేడీ’ ఎర్నలిస్టుకి అంత బాగా తెలిసి వుంటుంది.!
Also Read: HBD Sai Durgha Tej: మళ్ళీ జన్మించావ్ తేజూ.! జై చిరంజీవ.!
సినీ పరిశ్రమలో కమిట్మెంట్ వుంటుందనీ, ఆ కమిట్మెంటుని బట్టే రెమ్యునరేషన్ అనీ.. బల్లగుద్ది వాదిస్తున్న ఆ కిలేడీ సినీ ఎర్నలిస్టుపై సినీ పరిశ్రమ పెద్దల చర్యలేమైనా వుంటాయా.?
ఓ నటి ఆత్మగౌరవాన్ని కించపర్చేలా వ్యవహరించిన ఆ కిలేడీ ఎర్నలిస్టుపై చట్టపరమైన చర్యలకు వున్న అవకాశమెంత.?