ఫ్రీ పబ్లిసిటీ రావాలంటే ఏం చేయాలి.? ఇంకేం చెయ్యాలి, నెగెటివిటీ గురించి మాట్లాడాలి. వీలైతే, సెన్సేషనల్ కామెంట్స్ చేయాలి.. లేదంటే, గ్లామరస్‌గా ఫొటోలకు పోజులివ్వాలి.. ఇదీ కొందరు అందాల భామలు చేసే పని (Ananya Pandey Hot). అందరూ అలానే వుండర్లెండి.
టాలెంట్ ప్లస్ బ్యూటీ.. రెండూ కలగలిసిన అనన్య పాండే సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
‘నేనెలా డ్రస్ చేసుకోవాలన్నది నా ఇష్టం.. నాకు కంఫర్ట్‌గా వుండే దుస్తుల్నే నేను ధరిస్తాను. ఈ క్రమంలో ఎంత ట్రోలింగ్ జరిగినా, నేను భయపడను. ఒకప్పుడు కొంత ఆందోళన చెందేదాన్ని, నన్ను ఎవరైనా డ్రస్సింగ్ విషయంలో విమర్శించినా, ట్రోల్ చేసినా. ఇప్పుడు అలా కాదు. నేను చాలా మారిపోయాను..’ అని చెప్పింది అనన్య పాండే.
హీరోయిన్లు ఇలాంటి మాటలు చెబితే, వినడానికి ఒక్కోసారి బాగానే వుంటాయి. కానీ, అందరూ కూడబలుక్కుని ఒకే సమాధానం ఎందుకు చెబుతారో ఏమో.! గ్లామరస్ ప్రపంచంలో గ్లామరస్‌గా వుండడం తప్పేమీ కాదు. సినిమా కోసం బికినీ వేయాల్సి వస్తుంది.. ఫొటో షూట్స్ కోసం హద్దులు మీరిన ఎక్స్‌పోజింగ్ కూడా చేయాల్సి వస్తుంది. అందరూ దీన్ని ఇష్టపడకపోవచ్చు.
కానీ, అనన్య పాండేకి ఈ విషయంలో పెద్దగా అభ్యంతరాల్లేవ్. హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాక, నెటిజన్లు ఊరుకుంటారా.? కొందరు ‘వావ్..’ అంటారు, ఇంకొందరు ‘వరస్ట్’ అంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది.
సోషల్ మీడియాకి ఓ ఫొటోనో, ఓ వీడియోనో అందిందంటే.. అది ప్రపంచమంతా తిరిగేస్తుంటుంది. ఎవరి గోల వారిది. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఆయా ఫొటోల్ని అభివర్ణించేస్తుంటారు. అది తప్పే.. అయినా, దాన్ని ఆపడం కష్టం. అనన్య పాండేకి ఇవన్నీ తెలియవని ఎలా అనుకోగలం.? తెలిసినా ఆమె అలాగే మాట్లాడాలి.
ఎందుకంటే, తద్వారా సింపతీ క్రియేట్ అవ్వాలి. కెరీర్‌లో ఇలాంటి గిమ్మిక్కులన్నీ మామూలే. ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తోంది అనన్య పాండే (Ananya Pandey Hot). పాన్ ఇండియా సినిమా ఇది. పూరి జగన్నాథ్ దర్శకుడు ఈ చిత్రానికి.