Table of Contents
Anasuya Bharadwaj Age.. అమ్మాయిల్ని వయసు గురించి అడక్కూడదట.. అబ్బాయిల సంపాదన గురించి అడక్కూడదట.! సరే, ఈ రోజుల్లో ఈ రెండూ దాగే విషయాలు కావనుకోండి. అది వేరే సంగతి.
బుల్లితెర సంచలనం అనసూయ భరద్వాజ్ వయసు గురించిన చర్చ తరచూ జరుగుతూనే వుంటుంది. తాజాగా అనసూయ, తన వయసు గురించిన వాస్తవాన్ని వెల్లడించింది. తన వయసు 36 ఏళ్ళంటూ ఆమె స్వయంగా ప్రకటించింది.
వావ్.. అనసూయ తన వయసు గురించి చెప్పేసిందే.. అని కొదరు, ఇదంతా ఫేక్ అని మరికొందరు.. సెటైర్లు షురూ చేసేశారు.
Anasuya Bharadwaj Age.. వయసు దాచుకోవాల్సిన పనేంటి.?
అంతేనా, వయసును దాచుకోవాల్సిన అవసరమే తనకు లేదంటూ అనసూయ వ్యాఖ్యానించిందండోయ్. అనసూయ (Anasuya) ఎందుకిలా తన వయసు గురించి మాట్లాడిందట.? అంటే, ఆమె వయసు నలభయ్యేళ్ళంటూ ఎవరో ఆమె గురించి ‘రాసుకున్నారట’.
మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో.. అనసూయ పేరు ఎప్పుడూ సంచలనమే. ఏవేవో కథనాలు వస్తుంటాయ్. వాటి మీద అనసూయ మండిపడటమూ సర్వసాధారణమే. ఈసారి వయసు విషయమై అనసూయకు మంటెక్కింది.

మంటెక్కదా మరి.? అక్కడున్నది అనసూయ.. ఆమెకు ఎప్పుడెలా మంటెక్కుతుందో చెప్పడం అంత తేలికైన వ్యవహారం కాదు మరి.
అందాలు.. పరువాలు.. ఒంపు సొంపులు.. ఇలా రకరకాల పద ప్రయోగాలతో అనసూయ గురించి అభివర్ణించడం మామూలు విషయమే. ఇద్దరు పిల్లల తల్లి అయినా, అందాల ప్రదర్శనలో అస్సలేమాత్రం మొహమాటపడదు అనసూయ.. (Anasuya Bharadwaj) అని ఎవరో రాస్తే, దానిపై గట్టిగా కౌంటర్ ఎటాక్ ఇచ్చిందామె.
వాళ్ళ తప్పు ఏమున్నదబ్బా.?
రాసిన దాంట్లో తప్పేముందో అనసూయకే తెలియాలి. ‘మేమూ మనుషులమే..’ అంటూ గుస్సా అయ్యిందీ బుల్లితెర బ్యూటీ. అదేంటో, అనసూయ ఏం చేసినా అది సంచలనమవుతూ వస్తోంది. అదీ ఆమెకున్న ఫాలోయింగ్.
‘పుష్ప’ (Pushpa) సినిమాలో దాక్షాయణి పాత్రకి విడుదలకు ముందు బోల్డంత హైప్ వచ్చింది. సినిమాలో (Pushpa The Rise) తుస్సుమంది ఆ పాత్ర. ‘ఖిలాడీ’ (Khiladi) సినిమాలో అయితే అనసూయ గ్లామర్ విషయంలో హద్దులు దాటేసిందంటూ బోల్డంత రచ్చ జరిగింది.
Also Read: అన్వేషి జైన్: ‘ప్లస్ సైజ్’.. అది నా తప్పు కాదు.!
చేస్తే తప్పు లేదు.. ఆ చేసిన ఘనకార్యం గురించి చెబితే (రాస్తే) తప్పెలా అవుతుంది అనసూయా.? అని ఆమె మీద సెటైర్లు పడుతున్నాయి. బాడీ షేమింగ్ గురించీ, ఏజ్ షేమింగ్ గురించీ.. అనసూయ క్లాసులు పీకుతూనే వుంటుంది.
సినిమాల్లోనూ, కామెడీ స్కిట్లలోనూ ఆ షేమింగ్ చుట్టూనే సెటైర్లేయించుకోవడం ఆమెకు (Anasuya Bharadwaj Age) అలవాటే.!
అందం చూడాలె.. ఆస్వాదించాలె.!
అయినా, అనసూయ భరద్వాజ్‌కి కోపమొచ్చిందని కాదుగానీ, ‘అందం చూడవయా.. ఆనందించవయా..’ అన్నట్టు, ఆమె ‘అందాన్ని’ ఆస్వాదించడం మానేసి, ఈ రచ్చ దేనికట.? అలా ఆస్వాదిస్తూ, తన్మయత్వంతో ఔత్సాహికులు ఏవేవో రాతలు రాస్తే, వాటి మీద అనసూయ గుస్సా అవుతుండడం వల్లే ఇదంతా.!

ఏమాటకామాటే చెప్పుకోవాలి.. అనసూయ ఏం చేసినా అదో సంచలనం.. పబ్లిసిటీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంటుంది. ఒకవేళ పాపులారిటీ తగ్గిందనిపిస్తే, ఇదిగో ఇలాంటి ఏదో ఒక రచ్చ సృష్టించి, తనదైన స్టయిల్లో పాపులారిటీ పెంచేసుకోవడంలో దిట్ట ఈ బ్యూటీ.
ఇంతకీ అనసూయ అసలు వయసెంత.? ఆమె చెబుతున్నట్లు ముప్ఫయ్ ఆరేళ్ళేనా.? ప్రచారంలో వున్నట్టు నలభై మూడేళ్ళా.? ఆమె వయసు ఎంతైతే ఎవరికేంటి.?