Anasuya Bharadwaj Avoiding Heroes ప్చ్.. సెలబ్రిటీలు ఏం మాట్లాడినా, అందులోంచి ఓ చిన్న ముక్కని తీసుకుని, ట్రోల్ చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణమైన విషయం.
చాలామంది సెలబ్రిటీలు, ట్రోలింగుని లైట్ తీసుకుంటుంటారు. కొందరు దాన్ని సీరియస్‌గా తీసుకుంటుండడం చూస్తుంటాం. ఎవరి ఇష్టం వాళ్ళది.!
అనసూయ భరద్వాజ్ విషయానికి వస్తే, ట్రోలింగ్ కోసం కంటెంట్ ఆమె ఇస్తోందని అనలేంగానీ, ఆమె ఏం మాట్లాడినా, క్షణాల్లో ట్రోలింగ్‌కి గురవుతుంటుంది.
Anasuya Bharadwaj Avoiding Heroes.. లైన్ వేయడానికే అప్రోచ్ అవుతారా.?
తాజాగా, ‘హీరోలందరూ లైన్ వేయడానికే అప్రోచ్ అవుతుంటారనే ఆలోచనతో అవాయిడ్ చేసేశాను..’ అంటూ అనసూయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.
అంతే, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ షురూ అయ్యింది.! అనసూయ మేకప్పు గురించీ, ఆమె శరీరం గురించీ.. అబ్బో, చిత్ర విచిత్రమైన కామెంట్లు ట్రోలింగ్ రూపలో కన్పించాయి.

‘బాడీ షేమింగ్’ చేస్తూ అనసూయకి వ్యతిరేకంగా నెటిజనం పోస్టులు పెడుతున్నారు. నిజానికి, అనసూయ విషయంలో ఇలాంటివి కొత్తగా జరుగుతున్నవేమీ కావు.
గతంలో, ఆమె తన మీద జరుగుతున్న ట్రోలింగ్‌పై సైబర్ క్రైమ్‌ని కూడా ఆశ్రయించారు. కొందరిపై కేసులు నమోదయినట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది.
ట్రోలింగ్ ఆపతరమా.?
అయినా, సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ని ఆపడం ఎవరితరమూ కాదు.! ప్రధాన మంత్రి కూడా ఈ ట్రోలింగ్ నుంచి తప్పించుకోలేకపోతున్న రోజులివి.
అలాగని, సెలబ్రిటీలు ‘నోరు కట్టేసుకుని’ వుండాలా.? అంటే, అది కుదరని పని. ఇంటర్వ్యూల్లో ఏవేవో అడుగుతుంటారు, సందర్భానుసారం కొన్ని మాటలు చెప్పాల్సి వస్తుంటుంది.
Also Read: ప్రగతి రెండో పెళ్ళి.! పుకారు పుట్టించిందెవరు.?
కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు, పాపులారిటీ కోసం ‘ట్రోలింగ్ కంటెంట్’ ఇస్తుంటారనుకోండి.. అది వేరే సంగతి.!
ఏది ఏమైనా, ట్రోలింగ్ ఇప్పట్లో ఆగేలా లేదు.. సెలబ్రిటీల మీద. అసలు ఆగదు కూడా.!
అనసూయ ఏం మాట్లడినా, అది ట్రోలింగ్ మెటీరియలే అవుతోంది.! ఆ మాటకొస్తే, సెలబ్రిటీలందరిదీ ఇదే వరస.! కాదేదీ ట్రోలింగుకి అనర్హం అని నెటిజనం ఫిక్సయిపోయాక.. ట్రోలింగ్ విశ్వవ్యాపితమయ్యాక.. దీనిపై రచ్చ అర్థం లేనిది.!