Table of Contents
Anasuya Bharadwaj Kassu Bussu.. ఔను కదా, తెరపై విప్పితే తప్పేముంది.? నటీనటులు ఎప్పటినుంచో చేస్తున్నదే కదా.! ట్రెండ్ మారింది.. తెరపై నగ్నత్వం కూడా తప్పు కాకుండా పోతున్న రోజులివి.!
బుల్లితెరపైనా లెక్కలు మారాయ్.! డస్సుల సైజులు తగ్గుతున్నాయ్.! తప్పేముంది.? ఇది నయా ట్రెండ్.!
ఓ టీవీ షోలో, అనసూయ భరద్వాజ్ కోట్ విప్పేసింది.. అదే వేదికపై కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా షర్ట్ తీసేశాడు.!
Anasuya Bharadwaj Kassu Bussu.. ఏందీ ఛండాలం.?
ఈ లైన్స్ చదవడానికే చాలా ఛండాలంగా వుంది కదా.! అయినా, ఇందులో ‘ఛండాలం’ అనుకోవడానికేముంది.? అంతకన్నా హాట్‌గా అనసూయ కనిపించింది కదా.?
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కుని బట్టి, సన్నివేశం తాలూకు ‘ప్రభావం’ మారిపోతుందంటూ, అనసూయ భరద్వాజ్ ఓ వీడియో పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో. అది నిజమే సుమీ.!

టీవీ షోలో అలా ఎలా కోట్ (జాకెట్) విప్పేస్తావ్.? అంటూ అనసూయ మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుండడంతో, అనసూయ ఇలా వివరణ ఇచ్చుకుంది.
తాము ఏం చేయాలో దర్శకులు చెబుతారనీ, ఒక్కోసారి నటీనటులు ఆయా సన్నివేశాల్లో తమను తాము ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుని నటిస్తారనీ అనసూయ చెప్పుకొచ్చింది.
తప్పెవరిది.?
నిజానికి, అనసూయ వాదనని తప్పు పట్టలేం. ఆమె అందాల ప్రదర్శన చేస్తే, దాన్ని తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు. అది ఆమె ఇష్టం.
అత్యంత అసభ్యకరమైన జోకులు, వెకిలి వేషాలకు కేరాఫ్ అడ్రస్ అయిన టీవీ షోల్లో.. గ్లామర్ పేరుతో అసభ్యంగా కనిపించడాన్ని సమర్థించుకునే అనసూయ.. విక్టిమ్ కార్డ్ తరచూ ప్లే చేస్తూ నీతులు చెబుతుంటుందనే విమర్శలు లేకపోలేదు.
Mudra369
కాకపోతే, చూసేందుకు చాలా అసభ్యంగా అనిపిస్తోందనీ, అసహ్యకరమైన పద్ధతిలో వ్యవహరించొద్దనీ.. చూసేటోళ్ళు అనుకోవడం తప్పు కాదు కదా.?
‘నచ్చకపోతే చూడొద్దు..’ అని సెలబ్రిటీలు ఇలాంటి సందర్భాల్లో చెప్పడం చూస్తున్నాం. కుటుంబంతో కలిసి టీవీ ముందర కూర్చున్నప్పుడు, హఠాత్తుగా ఆ సన్నివేశం వస్తే ఎలా.? అన్నది కొందరి వాదన.
ట్రెండ్ సెట్ చెయ్యాల్సిందే..
ముందే చెప్పుకున్నట్లు ట్రెండ్ మారింది.! ఆ ట్రెండ్‌కి అడ్జస్ట్ అయినోళ్ళు ఎంజాయ్ చేస్తారు. ట్రెండ్‌కి దూరంగా వున్నోళ్ళు ఆక్షేపిస్తారు.

సో, అనసూయ ఇచ్చుకున్న వివరణ కూడా అందరికీ నచ్చుతుందని ఎలా అనగలం. కొందరికి నచ్చుతుంది.. కొందరు దీన్ని కూడా ట్రోల్ చేస్తారు.!
‘నన్ను తప్పు పట్టొద్దు..’ అంటున్న అనసూయ, ట్రోల్ చేసేవాళ్ళనీ తప్పు పట్టడం మానేస్తే బెటర్.! ఇక, ‘అబ్యూజ్’ చేయడం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
Also Read: ఆ విషయంలో దీపికని మెచ్చుకోవాల్సిందే.!
సోషల్ మీడియాకి సెన్సార్ కష్టం.! కాదు కాదు, అసాధ్యం.! కానీ, అసభ్యకరమైన కామెంట్లు చేయడం తప్పు.! ఇది మాత్రం చెప్పగలం.!
ఎవర్నీ ‘కంట్రోల్’ చేయలేం.! వ్యవస్థలకు అది సాధ్యం కాని పరిస్థితి ఈ సోషల్ యుగంలో. ఇదో ట్రెండ్.. అని సరిపెట్టుకోవాల్సిందేనేమో.!