Anasuya Bharadwaj Mad Queen.. బుల్లితెర బ్యూటీ అనసూయా భరద్వాజ్ ఏం చేసినా అదో సెన్సేషనే. అయితే ఈ సారి సెన్సేషన్ కాదు.. ఓ విచిత్రమైన డిస్కషన్ జరుగుతోంది.
అనసూయ నటిస్తున్న తాజా సినిమా కోసం జరుగుతున్న డిస్కషన్ అది. అనసూయ నటిస్తున్న ‘మైఖేల్’ సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్ పోషిస్తున్న సినిమా ఇది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోన్న బైలింగ్వల్ మూవీ. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాలో అనసూయ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. ఆమె పాత్రకు సంబంధించి లేటెస్ట్‌గా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌కి సంబంధించిన చర్చే ఇప్పుడు మన టాపిక్.
Anasuya Bharadwaj Mad Queen ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గురూ.!
‘ది మ్యాడ్ అనసూయ భరద్వాజ్ క్వీన్..’ అని రాసుంది పోస్టర్‌పై. ఈ రాతే అనసూయను సోషల్ వేదికగా టార్గెట్ అయ్యేలా చేసింది.
అనసూయకి పిచ్చి అనే అర్ధం వచ్చేలా వుందంటూ.. అవును నిజమే అనసూయకి పిచ్చే కదా.. అంటూ ఆమె హ్యాటర్స్ నెట్టింట చెలరేగిపోతున్నారు.

నిజానికి ఆ పోస్టర్‌లో అర్ధం అది కాకున్నా, ఛాన్స్ వచ్చింది కదా.. అలా ట్రోల్ చేసేస్తున్నారు అనసూయని. పోస్టర్ విషయానికి వస్తే, చాలా ఇంటెన్సింగ్ లుక్‌లో సీరియస్‌గా కనిపిస్తోంది అనసూయ.
అన్నట్లు గతంలో ‘సాహస బాలుడు విచిత్ర కోతి’ అనే సినిమా వచ్చింది గుర్తుండే వుంటుంది. విజయ శాంతి ఆ సినిమాలో లీడ్ రోల్ పోషించింది.
Also Read: రుహానీ శర్మ HER Teaser: పోలీస్‌ని అర్థం చేసుకున్నా.!
విజయ శాంతి క్యారెక్టర్ రివీల్ చేస్తూ వచ్చిన పోస్టర్ కూడా అప్పట్లో ఇలాగే వివాదాస్పదమైంది ఫన్నీగా. ‘సాహస బాలుడు ఇన్ అండ్ యాజ్ విజయ శాంతి విచిత్ర కోతి’ అని పోస్టర్ రిలీజ్ చేశారు.
దాంతో.. అదేంటీ.? విజయ శాంతి సాహసబాలుడా.? విచిత్ర కోతినా.? అంటూ పన్నీ కామెంట్లు చేశారు కొందరు. అలాగే ఇప్పుడు అనసూయ పోస్టర్‌పైనా కామెంట్లు వస్తున్నాయ్. అదీ సంగతి.