Anasuya Bharadwaj Pempakam.. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ్ దేవరకొండ విషయంలో తగ్గేదే లే.. అన్నట్టు వ్యవహరిస్తోంది అనసూయ భరద్వాజ్.!
ఎప్పుడో జరిగిన వ్యవహారమది.! అప్పట్లో ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) హ్యాంగోవర్‌లో ఏదో అనకూడని మాట అనేశాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). అది కూడా అనసూయని కాదు.!
కానీ, అనసూయ ఆ మాటని సీరియస్‌గా తీసుకుంది. కాదు కాదు, అంతకు ముందే అనసూయ భర్తతో విజయ్ దేవరకొండ గొడవ పడ్డాడనీ, అవమానించాడనీ అంటారు.!
కారణం ఏదైతేనేం, అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) మాత్రం అస్సలు వదిలి పెట్టనంటోంది.!
‘నేనెందుకు వదిలిపెట్టాలి.? నేను నిజమే మాట్లాడుతున్నాను.. నేను పోరాడుతున్నాను.. వున్న మాటే చెబుతున్నాను..’ అంటోంది అనసూయ.
Anasuya Bharadwaj Pempakam.. ఇంకెన్నాళ్ళీ ఆన్‌లైన్ రచ్చ.?
కానీ, ఎన్నాళ్ళిలా.? అనసూయ ఎంత గింజుకుంటున్నా, అట్నుంచి విజయ్ దేవరకొండ స్పందించడంలేదు. స్పందించాల్సిన అవసరమూ అతనకి లేదు.
కానీ, విజయ్ దేవరకొండ అభిమానులు గుస్సా అవుతున్నారు. అనసూయని బూతులు తిడుతున్నారు. నిజంగానే అది చాలా పెద్ద తప్పు.!

తాజాగా, అనసూయ (Anasuya Bharadwaj) ఇంకో ట్వీటాస్త్రం సంధించింది. పెంపకం గురించి మాట్లాడింది. కంపు నోరు గురించి మండిపడింది.
మంచి పెంపకం.. చెడు పెంపకం..
‘నువ్వు నన్ను తిడితే.. నీ కంపు నోరు తప్పవుతుంది కానీ నేనెలా తప్పవుతాను..’ అంటూ తన ట్వీటులో పేర్కొంది అనసూయ.
అంతే కాదు, ‘నా పెంపకం గర్వించతగింది.. నా అభిప్రాయాన్ని ధైర్యంగా గౌరవపూర్వకంగా చెప్పటం నేర్పింది..’ అని అనసూయ చెప్పుకుంది.
Also Read: డైరెక్టర్‌ని ‘వుంచుకుంటా’నన్న హీరోయిన్.! ఇదో రకం పైత్యం.!
‘మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి..’ అంటూ అనసూయ (Anasuya Bharadwaj) తన ట్వీటులో ప్రస్తావించింది.
అంతే కాదు, ‘షేమ్ ఆన్ అబ్యూజర్.. నాట్ ది అబ్యూజ్డ్.. పీరియడ్’ అంటూ ట్వీటుని ముగించింది అనసూయ.
నిజమే, సోషల్ మీడియాలో ఏం చేసినా చెల్లిపోతుందనుకునేవారు.. బూతుల విషయంలో తమను తాము ప్రశ్నించుకోవాలి. ఈ విషయంలో అనసూయని సమర్థించాల్సిందే.
కానీ, పనిగట్టుకుని.. రెచ్చగొడుతుండడాన్ని ఏమనాలి.? అన్నదీ కాస్త ఆలోచించాల్సిన విషయమే.