Anasuya Bharadwaj.. ఏంటో ఛీ..పాడు సోషల్ మీడియా. సెలబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా చేసేస్తోందే.! కాదు కాదు, సెలబ్రిటీలే నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేసేస్తున్నారనీ అనుకోవచ్చు. ఎవరికి ఎలా అర్థమయితే అలా.! సోసల్ మీడియా వేదికగా అభిమానులతో సలువురు సెలబ్రిటీలు ముచ్చటించడం కొత్తేమీ కాదు.
నటి అనసూయ భరద్వాజ్ కూడా అలాగే నెటిజన్లతో వీలు చిక్కినప్పుడల్లా ముచ్చటిస్తుంటుంది. వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కాంట్రవర్సీ తెరపైకొస్తుంటుంది. కొంటె కుర్రాళ్ళు వేసే ప్రశ్నలు, వాటికి అనసూయ సమాధానాలు చెప్పే తీరు.. వెరసి, ఆ వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంటుంది.
రంగమ్మత్త.. అంటే Anasuya Bharadwaj మురిసిపోయేదిగానీ..
‘రంగస్థలం’ సినిమాతో అనసూయకి ‘రంగమ్మత్త’ అనే పేరు ఇంటిపేరులా మారిపోయిన మాట వాస్తవం. ‘మహర్షి’ సినిమాతో నటుడు రాఘవ కాస్తా మహర్షి రాఘవ అయ్యాడు. ‘సిరివెన్నెల’ అనే సినిమా పేరు, పాటల రచయిత సీతారామశాస్త్రికి ఇంటిపేరుగా మారిన సంగతి తెలిసిందే.

చెప్పుకుంటూ పోతే, ఇలాంటివి చాలానే వుంటాయి. అదంతా వేరే కథ. సినీ సెలబ్రిటీల్ని అన్న అనిగానీ, అక్క అనిగానీ పిలవడం అభిమానులకి అలవాటే.
అనసూయని కూడా అలాగే ఓ నెటిజన్ ‘మిమ్మల్ని ఆంటీ అనాలా.? అక్క అనాలా.?’ అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలోని కొంటెతనాన్ని గుర్తించిన అనసూయ, ‘నన్ను ఆ రెండు రకాలుగానూ పిలవొద్దు..’ అని స్పష్టం చేసేసింది. కాస్తంత మండిపడింది ఆ నెటిజన్ మీద.
అది కామెడీ, ఇది సీరియస్.!
అదేంటీ, ‘జబర్దస్త్’ కామెడీ షోలో స్కిట్స్ వచ్చినప్పుడు ఆదితో ‘అవ్వ’ అని కూడా అనిపించేసుకుంటావ్ కదా.? అంటూ సోషల్ మీడియాలో అనసూయకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది.
‘బుడ్డోడు.. బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా..’ అని ఓ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీయార్ బీభత్సమైన డైలాగ్ చెప్పేస్తాడు. అది ‘బుడ్డోడు’ అని తనను కొందరు పిలవడంపై ఎన్టీయార్ ప్రదర్శించిన ఎక్స్‌ప్రెషన్.
Also Read: అసలేంటీ ‘చింతామణి’ నాటకం.! ఎవరిది ఈ పాపం.?
అనసూయ విషయంలో అయినా అంతే.! ఆమెకి ఇష్టమైతే ‘రంగమ్మత్త’ అనొచ్చు, ‘పుష్ప’ సినిమాలో ఆమె పాత్ర పేరైన దాక్షాయణి అనైనా అనొచ్చు. లేదటే ‘అక్కా’ అని చాలామంది అభిమానంగా పిలిచినట్టైనా పిలవొచ్చు. అంతేనా.! ఇంకేమైనా డౌట్లున్నాయా.?