విప్పుకుంటానో, కప్పుకుంటానో.. నా ఇష్టం. చూసి పండగ చేసుకుంటావో. చూడలేక కళ్లు మూసుకుంటావో.. అది నీ ఖర్మ. ఇదీ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. పాత తరం పెద్దాయన కదా.. కొంచెం తట్టుకోలేకపోయాడు. ఏదో ఉచిత సలహా పడేద్దామనుకున్నాడు. ఫలితంగా ( Anasuya Bharadwaj ) చీవాట్లు తినేస్తున్నాడు.
సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు (Kota Srinivasa Rao) ఏదో అన్నారని.. అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ట్వీట్లు పోటెత్తాయ్. చూసే కళ్లలో అసభ్యత ఉంటుందేమో కానీ, మేం చూపించే సోయగంలో లేదు.. అని చాలా మంది అందాల భామలు చెప్పే పాత కథనే అనసూయ కొత్తగా వల్లించింది.

పాపం పెద్దాయన.. వదిలేయొచ్చుగా అనసూయా..
నిజానికి కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఆ మాట అని ఉండకూడదు. ఎందుకంటే, సుదీర్ఘ నట జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారాయన. రేప్ సీన్లలో నటించారు. విలనిజానికి కేరాఫ్ అడ్రస్ అనిపించుకున్నారు. డబుల్ మీనింగ్ డైలాగులూ చెప్పారు. వృద్ధ నారీ డాష్ డాష్ అన్నట్లు ఇప్పుడు నీతులు చెబితే ఎలా.?
అనసూయ పొట్టి డ్రస్సులేసి చేసేది కూడా నటనే. అలా ఆమె గ్లామరస్‌గా కనిపించడం వల్లే, ఆమెకు పాపులారిటీ పెరిగింది. అది ఆమెకీ తెలుసు. చూసే కళ్లలో తేడా ఉందా.? వేసే దుస్తుల్లో తేడా ఉందా.? అన్నది తెలుసుకోలేనంత అమాయకురాలైతే కాదు అనసూయ (Anasuya). అది ఆమె ఇష్టం. ట్రెండ్ ఫాలో అవుతోంది. టైమొచ్చింది.. పెద్దాయనను ఏకి పారేసింది.
Anasuya Bharadwaj అసహనం.. అదేనా కారణం.?
అసలే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఈసీ మెంబర్‌గా పోటీ చేసి ఓడిపోయిందేమో.. ఆ అసహనం కూడా ఈ రకంగా ఆవేశపడి చల్లార్చుకునే ప్రయత్నం అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) చేసిందేమో. బయట అమ్మాయిలెలా ఉన్నారు.? సినిమా హీరోయిన్లు, బుల్లితెర భామలూ వీళ్లకేమాత్రం తీసి పోవడం లేదు.
Also Read: చింపేస్తాం.. పోగులే ధరిస్తాం.. అంతా మా ఇష్టం.!
అమ్మాయి పద్ధతిగా కనిపిస్తే, ఎంత బావుంటుందో.. అని ముచ్చట పడడం కోట చేసిన పెద్ద తప్పు. నిజానికి కోట మరీ అంత తీవ్రంగా అనసూయను విమర్శించేయలేదు. కానీ, మూల్యం గట్టిగానే చెల్లించుకున్నాడు. వయసు మీద పడింది కదా.. ఛాదస్తం పెరిగిపోయి అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని, ఇదిగో ఇలా వివాదాల పాలవుతున్నాడు.
నట జీవితంలో ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కోట, పబ్లిసిటీ కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకోలేం. దురదృష్టం, ఆయన వ్యాఖ్యలు వేరే వాళ్లకు పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయ్.