Anasuya Bharadwaj Super Power.. వావ్.! అనసూయ ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది.! మంచి మాటే లెండి.! జ్ఞానోదయం.. అని ఎవరైనా సెటర్లేయొచ్చుగాక.! అది వేరే వ్యవహారం.
ఇంతకీ, అనసూయ భరద్వాజ్ ఏం చెప్పిందబ్బా.? అసలు విషయమేంటంటే, ‘గుర్తు పెట్టుకోండి.. మీరు చేసే పని మీరు చేసే విధంగా ఇంకెవరూ చెయ్యలేరు..’ అంటూ ట్వీటింది అనసూయ.
తన తాజా ఫొటో సెషన్ స్టిల్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అనసూయ చేసిన వ్యాఖ్యలిప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయ్.!
Anasuya Bharadwaj Super Power.. అనసూయ రూటే సెపరేటు..
అవును, ‘రంగస్థలం’ సినిమాలోని ‘రంగమ్మత్త’ పాత్రలో నిన్ను తప్ప ఎవర్నీ ఊహించుకోలేం.. అంటూ అనసూయ గురించి మాట్లాడుతున్నారు నెటిజనం.
అంతేనా, ‘పుష్ప’ (Pushpa The Rise) సినిమాలోని నీ పాత్ర కూడా, నువ్వు చేసిన విధంగా ఇంకెవరూ చేయలేరు.. అంటూ అనసూయపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అక్కడితో ఆగితే.. అది సోషల్ మీడియా ఎలా అవుతుంది.? ‘ఔను, నీలా పబ్లిసిటీ స్టంట్స్ ఇంకెవరూ చేయలేరు..’ అని కొందరు నెటిజన్లు సెటైర్లేస్తుండడం గమనార్హం.
అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) చేసినంత అందాల ప్రదర్శన కూడా ఇంకెవరికీ సాధ్యం కాదేమో.. అనేవారూ లేకపోలేదండోయ్.!
మంచి చెప్పినా ట్రోలింగేనా.?
చెప్పింది మంచి మాటే కదా., అనసూయ భరద్వాజ్ మీద సెటైర్లెందుకు.? అంటే, ఇది సోషల్ మీడియా.! ఇక్కడ ఎవడికి నచ్చింది వాడు చేస్కోవచ్చు.!
అసభ్యకరంగా, జుగుప్సాకరంగా వుండనంతవరకు సెటైర్లు పెద్దగా ఎవర్నీ బాధించవనుకోండి.. అది వేరే సంగతి.

అప్పుడెప్పుడో, చాలాకాలం క్రితం విజయ్ దేవరకొండ మీద ఫైర్ అయిన అనసూయ (Anasuya Bharadwaj), అప్పటినుంచి ఇప్పటివరూ ఆ ‘రౌడీస్’ నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంటూనే వుంది.!
Also Read: మీరూ ఇదే బాపతా.? జర జాగ్రత్త.. ఖర్సయిపోతారు.!
ఆ విషయం పక్కన పెడితే, స్టిల్స్ చూస్తున్నారు కదా.! ఆ అప్పీల్.. అనసూయకి మాత్రమే సొంతం.! జబర్దస్త్ గ్లామర్ విషయంలో అనసూయకి సాటి ఇంకెవరూ రారంతే.!
‘పుష్ప ది రైజ్’ (Pushpa The Rise) సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనసూయ, ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ అయిన ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule) విడుదల కోసం ఎదురుచూస్తోంది.